`టక్‌ జగదీష్‌` టైటిల్‌ ట్రాక్‌.. పాడింది ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

By Aithagoni RajuFirst Published Sep 3, 2021, 2:50 PM IST
Highlights

 సెప్టెంబర్‌ 10న సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై భజ్‌ పెంచింది యూనిట్‌. ఇప్పుడు టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. నాని పాత్రని ప్రతిబింబింపచేసేలా ఈ టైటిల్‌ ట్రాక్‌ని కంపోజ్‌ చేశారు.

నాని హీరో నటిస్తున్న చిత్రం `టక్‌ జగదీష్‌`.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. థియేటర్లకి జనాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ఓటీటీ బెస్ట్ ఆప్షన్‌ అని భావించింది యూనిట్‌. ఓటీటీలో రిలీజ్‌పై నానిపై, చిత్ర బృందంపై విమర్శలొచ్చాయి. ఇటీవల `టక్‌ జగదీష్‌` ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాని, దర్శకుడు శివ నిర్వాణ సైతం ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 

ఇక సెప్టెంబర్‌ 10న సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై భజ్‌ పెంచింది యూనిట్‌. ఇప్పుడు టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. నాని పాత్రని ప్రతిబింబింపచేసేలా ఈ టైటిల్‌ ట్రాక్‌ని కంపోజ్‌ చేశారు. ఇందులో విచిత్రమేంటంటే ఈ పాటని దర్శకుడు శివ నిర్వాణ పాడటం. ఈ పాటని ఆయనే రాయడం మరో విశేషం.

మొదట సంగీత దర్శకుడు గోపీసుందర్‌, దర్శకుడు శివ కలిసి నానితో ఈ పాటని పాడిద్దామనుకున్నారు. కానీ నాని వద్దకు వచ్చి శివ ఇరుక్కుపోయాడు. నాని, గోపీసుందర్‌ కలిసి శివనిర్వాణతో కలిసి పాడించారు. శుక్రవారం విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. నాని నటించిన జగదీష్‌ నాయుడు పాత్ర పవర్‌ని చూపించేలా ఈ లిరిక్‌ ఉండటంతో మరింతగా ఆకట్టుకుంటుంది. 

click me!