ప్రియా వారియర్ పై నెటిజన్ల ట్రోలింగ్!

By Udayavani DhuliFirst Published Oct 5, 2018, 3:07 PM IST
Highlights

'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటలో కన్నుకొట్టి యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఎంత తొందరగా ఆమెకి పాపులారిటీ దక్కిందో.. ఈ మధ్య కాలంలో ఆమెని అంతగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తన కన్నుగీటితో సినీ పరిశ్రమని ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. 

ముఖ్యంగా ప్రకటనల్లో నటించే ఛాన్స్ బాగా వచ్చింది. ఈ క్రమంలో ఆమె అక్కినేని అఖిల్ తో కలిసి ఓ షాపింగ్ మాస్ యాడ్ లో నటించింది. ఇద్దరినీ జంటగా చూసిన అభిమానులు ఆనందపడ్డారు. అయితే ఈ యాడ్ లో వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలను మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ యాడ్ లో.. ''అఖిల్ ఉవా.. ఉవా అంటే ఏమిటీ..?'' అని ప్రియ అడుగుతుంది. ఇందుకు అఖిల్.. ''షాపింగ్ మాల్‌లోకి వెళ్లగానే నీకు ఏమనిపిస్తుంది?'' అని అడుగుతాడు.. ఇందుకు ప్రియ'ఊ...' అంటుంది. ''ప్రైస్ రేంజ్ చూస్తే ఏమినిపిస్తుంది?'' అని అఖిల్ అడిగితే 'వావ్' అంటుంది.

ఇప్పుడు రెండూ కలిపి చెప్పు అనగానే.. ''ఉ.. వావ్.. ఉవా ఉవా'' అంటుంది. ఇది విన్న నెటిజన్లకు కాస్త ఓవర్ గా అనిపించడంతో ప్రియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకి ఎంతో క్రేజ్ ఉన్న కేరళలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ప్రియా ప్రకాష్ కు ఊరట: పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

తక్కువ చేసి మాట్లాడకండి.. ప్రియా ప్రకాష్ వారియర్ వ్యాఖ్యలు!

ప్రియా వారియర్ కు గౌన్ తెచ్చిన కష్టాలు!

కన్నుకొట్టి యాడ్స్ కూడా తెచ్చుకుంది

కన్ను కొట్టినందుకే కోటి ఇచ్చేశారు

షాక్..! రోడ్డుకెక్కిన ప్రియా వారియర్

click me!