యాత్ర బయోపిక్ లో జగన్ పాత్ర పరిస్థితేంటి?

Published : Oct 05, 2018, 03:00 PM ISTUpdated : Oct 05, 2018, 03:19 PM IST
యాత్ర బయోపిక్ లో జగన్ పాత్ర పరిస్థితేంటి?

సారాంశం

టాలీవుడ్ లో ఇప్పుడిపుడే బయోపిక్ ల పర్వం మొదలైంది. వెండితెర  మహా నటులతో పాటు రాజకీయ నాయకుల కథలు కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు టీడీపీ సృష్టికర్త ఎన్టీఆర్ కథ స్పీడ్ గా కొనసాగుతుంటే మరోవైపు అంతకంటే వేగంగా మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ని కూడా నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చేయడానికి యాత్ర నిర్మాతలు ముందే డిసైడ్ చేశారు. అయితే సినిమాలో అన్ని పాత్రల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి షూటింగ్ ను కొనసాగిస్తున్న దర్శకుడు మహి వి రాఘవ వైఎస్ కుమారుడు జగన్ కు సంబంధించి ఎలాంటి విషయాన్నీ బయటపెట్టలేదు. ఓ సారి సూర్య మరోసారి కార్తీ అన్నట్లు టాక్ వస్తున్నప్పటికీ అది నిజమని కూడా ఎవరు నిర్దారించలేదు. 

అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం దర్శకుడు ఎక్కువగా వైఎస్.రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ ఆయుధం యాత్రపైనే ద్రుష్టి పెట్టారట. వైఎస్ జనాల్లో అంత ఈజీగా ఎలా కలిసిపోయారు. యాత్రలో ఆయన ఏ విధమైన ఆలోచనలతో వెళ్లేవారు అని ఇలా పలు అంశాలను ఎమోషనల్ గా చూపించాలని అనుకుంటున్నారట. ఇకపోతే ఇప్పుడు పార్టీని స్థాపించిన ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాత్ర సినిమాలో ఎక్కువగా ఉండకపోవచ్చని సమాచారం. మరి వస్తున్న కథనాలపై చిత్ర యూనిట్ ఎప్పుడు వివరణ ఇస్తుందో చూడాలి. వైఎస్సార్ పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.   

    PREV
    click me!

    Recommended Stories

    Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
    Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌