‘తలైవి’కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి

By Surya PrakashFirst Published Sep 12, 2021, 1:11 PM IST
Highlights

 తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకుని, సినీ నటిగా మొద‌లైన ఆమె ప్ర‌యాణం ముఖ్య‌మంత్రి అయ్యే వర‌కు ఎలా కొన‌సాగింది. 

 బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌  ...లేడి ఓరియెంటెండ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.  వ‌రుస‌ పెట్టి హీరోయిన్  ప్రాధాన్య‌మున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె  తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్‌ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుంది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు .. రివ్యూలు బాగా తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. మొదటి రోజు ఇండియా మొత్తం కోటి 28 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిన్న శనివారం కూడా కలెక్షన్స్ పెద్దగా ఏమీ లేవు. ముఖ్యంగా తెలుగులో భాక్సాఫీస్ పరంగా డిజాస్టర్ అయ్యినట్లే.

ఇక చిత్రం విషయానికి వస్తే...‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు  ఏఎల్ విజయ్.  ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్‌ పాత్రను హైలైట్‌ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అలాగే ఎక్కడా కాంట్రవర్శీ లేకుండా జాగ్రత్తలు పడ్డాడు. 

 ఎంజీఆర్‌ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్‌ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 
 

click me!