ప్రముఖ సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published Jul 19, 2021, 5:11 PM IST
Highlights

ప్రముఖ సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ కన్నుమూశారు. ఆదివారం చెన్సైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు టీఎస్‌ మురళీధరన్‌ కన్నుమూశారు. ఆదివారం చెన్సైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మురళీధరన్‌ ఫ్యామిలీ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆకస్మిక మరణంతో కోలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

హీరో సూర్య నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ `శ్రీ` చిత్రంతో సంగీత దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించారు మురళీధరన్‌. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా సంగీత దర్శకుడిగా ఆయన నిరూపించుకున్నారు. ఆయన పాటల విశేష శ్రోతకాదరణ పొందింది. అఖిల్ గౌరవ్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన 'గూడం' అనే హిందీ చిత్రానికి సంగీతం అందించారు మురళి. కెరీర్‌ ఊపందుకునే సమయంలో ఆయన మృత్యువాత పడటం విచారకరం. 

click me!