సైరా ట్రైలర్ 2.. యాక్షన్ డోస్ మాములుగా లేదు!

Published : Sep 26, 2019, 11:05 AM ISTUpdated : Sep 26, 2019, 11:09 AM IST
సైరా ట్రైలర్ 2.. యాక్షన్ డోస్ మాములుగా లేదు!

సారాంశం

మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషలా గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన మరో ట్రైలర్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ మరింతగా పెంచేసింది

మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషలా గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన మరో ట్రైలర్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ మరింతగా పెంచేసింది. యద్ద సన్నివేశాల నేపథ్యంతో కట్ చేసిన బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. 

ఇక మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్ కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఫీల్ ను కలిగిస్తున్నాయి. బ్రిటిష్ రాజ్యాలు దోచుకోవడానికి ప్రయత్నిస్తుంటే దేశమంతా ఏకమైనా విధానం అలాగే  ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఆ పరిస్థితులను ఎదుర్కొన్న విధానం సీన్స్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి.గడ్డి పరకకూడా గడ్డ దాటడానికి వీలు లేదని మెగాస్టార్ చెప్పిన మాటలకు థియేటర్స్ లో విజిల్స్ పడటం పక్కా. 

కొణిదెల ప్రొడక్షన్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

  

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు