మెగా డాటర్ సుస్మిత.. స్పెషల్ సైరా జ్యువెల్లరీ

Published : Sep 29, 2019, 10:19 AM ISTUpdated : Sep 29, 2019, 01:32 PM IST
మెగా డాటర్ సుస్మిత.. స్పెషల్ సైరా జ్యువెల్లరీ

సారాంశం

 సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాపై అంచనాలు రోజరోజుకి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ ని మరింత పెంచేస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాపై అంచనాలు రోజరోజుకి తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ ని మరింత పెంచేస్తోంది. 

రీసెంట్ గా  పార్క్‌ హయాత్‌లో  ‘సైరా’ నరసింహారెడ్డిలో వినియోగించిన ఆభరణాలను ప్రదర్శించారు. ఈ హిస్టారికల్ సినిమాకు  చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఆ స్పెషల్ ఈవెంట్ లో సుస్మిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రంలో మెగాస్టార్ తో పాటు హీరోయిన్ నయనతార ధరించిన ఆభరణాల తరహాలో జ్యువెల్లరీ ని రూపొందించారు. 

మంగత్‌రాయ్‌ సంస్థ స్పెషల్ గా రూపొందించిన ఆ జ్యువెల్లరీ వేడుకలో ఉన్నవారిని ఎట్రాక్ట్ చేశాయి. ఇక సైరా సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా కొన్ని నిమిషాలకే హాట్ కేకుల్లా ఆముదవుతున్నాయి. మొదటిరోజు దాదాపు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమివ్వనున్నాయి  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం