కిస్సింగ్ ఎపిసోడ్ పై కాజల్ సైలెన్స్.. కారణమేమిటంటే..?

Published : Nov 15, 2018, 02:57 PM ISTUpdated : Nov 15, 2018, 03:12 PM IST
కిస్సింగ్ ఎపిసోడ్ పై కాజల్ సైలెన్స్.. కారణమేమిటంటే..?

సారాంశం

రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ స్టేజ్ మీద ముద్దు పెట్టుకున్న సంగతి పెద్ద దుమారానికి తెరలేపింది. ఊహించని ఘటనతో షాక్ అయిన హీరోయిన్ ఆ విషయాన్ని పెద్దది చేయకుండా స్టేజ్ మీద ఏదో చెప్పి కవర్ చేసినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఈ విషయంపై సీరియస్ అయ్యారు. 

రీసెంట్ గా స్టార్ హీరోయిన్ కాజల్ ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు స్టేజ్ మీద ముద్దు పెట్టుకున్న సంగతి పెద్ద దుమారానికి తెరలేపింది. ఊహించని ఘటనతో షాక్ అయిన కాజల్ ఆ విషయాన్ని పెద్దది చేయకుండా స్టేజ్ మీద ఏదో చెప్పి కవర్ చేసినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ఈ విషయంపై సీరియస్ అయ్యారు.

సదరు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దీంతో అతడు వివరణ ఇవ్వక తప్పలేదు. అయితే అతడు వివరణ చెప్పిన తీరుతో తృప్తి చెందని అభిమానులు అతడి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇంత వ్యవహారం జరుగుతున్నా.. స్టార్ హీరోయిన్ కాజల్ మాత్రం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. దానికి కారణమేంటని ఆరా తీయగా.. సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుకి ఇండస్ట్రీలో పేరొందిన ఫ్యామిలీ బ్యాకప్ ఉండడం, ఆ ఫ్యామిలీతోనే ఈ కాజల్ కి సత్సంబంధాలు ఉండడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఈ విషయంపై మాట్లాడకపోవడమే మంచిదని గమ్మునుంటోంది. బాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారాలు కామనే అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఇలాంటి విషయాలను అంతతొందరగా యాక్సెప్ట్ చేయలేరు. 

సంబంధిత వార్తలు..
ఆమె గుర్తొచ్చి కాజల్ ని ముద్దు పెట్టుకున్నా.. ఛోటా వివరణ!

కాజల్ కి ముద్దు పెడతాడా..? అతడిని బ్యాన్ చేయండి: అభిమానుల ఆగ్రహం!

స్టేజ్ మీద హగ్, కిస్.. ఊహించని ఘటనతో షాకైన కాజల్!

PREV
click me!

Recommended Stories

George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
Nagadurga Second Film: స్టార్‌ హీరోయిన్లకి షాకిస్తున్న ఫోక్‌ సంచలనం.. నాగదుర్గ రెండో సినిమా షురూ