సునైనాతో ఎఫైర్, కౌశల్ ఆర్మీపై తనీష్ కామెంట్స్!

Published : Nov 15, 2018, 02:11 PM IST
సునైనాతో ఎఫైర్, కౌశల్ ఆర్మీపై తనీష్ కామెంట్స్!

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 లో ఫైనల్స్ వరకు చేరుకున్న తనీష్ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు దీప్తి సునైనాతో ఎఫైర్, కౌశల్ తో గొడవలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచేవాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తనీష్ ఏ మీడియా హౌస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు

బిగ్ బాస్ సీజన్ 2 లో ఫైనల్స్ వరకు చేరుకున్న తనీష్ టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు దీప్తి సునైనాతో ఎఫైర్, కౌశల్ తో గొడవలు వంటి కారణాలతో వార్తల్లో నిలిచేవాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత తనీష్ ఏ మీడియా హౌస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తాజాగా అతడు నటించిన 'రంగు' మూవీ విడుదలకు
సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి దీప్తి సునైనా, కౌశల్ ల గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీప్తి సునైనాతో ఎఫైర్ సాగుతుందన్న విషయంలో నిజం లేదని, అలాంటి రూమర్స్ వింటుంటే నవ్వొస్తుంటుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చానని కానీ ఇంకా అదే విషయం 
గురించి మాట్లాడుకునేవాళ్లను ఏం చేయలేమని అన్నారు.

''ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఒక అమ్మాయి, అబ్బాయి పక్కపక్కనే కనిపిస్తే చాలు.. రకరకాల కామెంట్లు వినిపిస్తాయి. నాకు, సునైనా విషయంలో కూడా అదే జరిగింది. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడను. కానీ నాపై వచ్చిన ట్రోలింగ్ కారణంగా మా అమ్మ చాలా బాధపడింది'' అంటూ చెప్పుకొచ్చారు.

అలానే కౌశల్ గురించి మాట్లాడుతూ.. ''కౌశల్ ఆర్మీ ఎంతో ప్రేమతో ఆయన్ని గెలిపించారు. హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి అభిమానించే వాళ్లు ఉన్నారు. కానీ ఈ అభిమానులందరూ వాళ్లు ట్రోల్ చేసే కామెంట్స్ ని ఇంట్లో వాళ్లకి చూపించగలరా..? అలా చూపిస్తే వాళ్ల తల్లితండ్రులే ముందు కొడతారు. కౌశల్ కి నాకు హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత మాటల్లేవు. మేం హౌస్ లో గొడవ పడడమే దానికి కారణం కాదు.. ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు'' అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి