పడిశలేరు బేబి... ఎ.ఆర్ రహమాన్ దృష్టిలో పడింది

By Udayavani DhuliFirst Published Nov 15, 2018, 2:33 PM IST
Highlights

టాలెంట్ ని మరో టాలెంట్ మాత్రమే గుర్తించగలదు. అందుకు నిదర్శనం..ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు కు చెందిన బేబి అనే మహిళ వీడియోని ఎ.ఆర్ రహమాన్ పోస్ట్ చేయటమే.

టాలెంట్ ని మరో టాలెంట్ మాత్రమే గుర్తించగలదు. అందుకు నిదర్శనం..ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు కు చెందిన బేబి అనే మహిళ వీడియోని ఎ.ఆర్ రహమాన్ పోస్ట్ చేయటమే.

పడిశలేరుకు చెందిన  మహిళ బేబీ గాత్రానికి నెటిజన్లే కాదు.. ఆస్కార్‌ విజేత రహమాన్‌ కూడా ముగ్ధుడవటం ఆనందం కలిగించే విషయమే. గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆమె పాటల వీడియోలు లక్షల మందిని ఆకట్టుకోగా.. తాజాగా ఆమె వీడియోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఎఆర్‌ షేర్‌ చేస్తూ ' ఎవరో తెలియదు కానీ.. అద్భుత గొంతు ' అని ప్రశంసించారు. 

దీంతో ఆమెకు గాయనిగా అవకాశం ఇవ్వాలని నెటిజన్లు రహమాన్‌ను కోరుతున్నారు. మరి రహమాన్ ఎలా స్పందిస్తారో. ఈలోగా టీవి ఛానెల్స్ వాళ్లు మాత్రం ఆమెకు ఆఫర్స్ ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. మరికొందరు తెలుగు దర్శకులు సైతం ఆమెకు ఛాన్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపెడుతున్నారు. 

బేబి వివరాలు..

పసల బేబీ సొంతూరు.. వడిశలేరు గ్రామం..తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం. ఆ కుగ్రామంలో ఈమె దినసరి కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటోంది. ఎవరో అమ్మాయి ఓ పాటను తప్పుగా పాడితే తట్టుకోలేక బేబీ తన గళాన్ని విప్పింది.  

అలా..‘‘ఓ చెలియా నా ప్రియసఖియా’’ అంటూ పాడిన బేబీ గొంతుకు ఎక్కడలేని క్రేజీ వచ్చింది. ఈ వీడియోకి ఫేస్‌బుక్‌లో విపరీతమైన  షేర్లు దక్కగా కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది.   ఆమె ఎప్పుడూ పెద్దగా నలుగురిలో పాడిన సందర్భాలు లేవు.  అయితే అనుకోకుండా ఒక యువతి చేసిన  చిన్న ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్ కావడంతో బేబీలోని టాలెంట్ తెలుగు సంగీత అభిమానులకు చేరింది. 

శంకర్ దర్శకత్వంలో ‘‘ప్రేమికుడు’’ సినిమాలో ఉన్ని కృష్ణన్ 1994లో పాడిన పాటకు బేబీ తన గొంతు కలిపింది. దాంతో కూనిరాగాలు మాత్రమే తీసే బేబీ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకొంది.

click me!