బాలు ఆసుపత్రి బిల్లు కోట్లలో...కట్టలేకపోయారంటూ ప్రచారం...ఖండించిన ఎస్పీ చరణ్

By Satish ReddyFirst Published Sep 28, 2020, 5:12 PM IST
Highlights

బాలు చికిత్స కోసం కోట్లలో ఖర్చు అయ్యిందని, ఆ బిల్లు చెల్లింపు విషయంలో కుటుంబ సభ్యులకు, ఎంజిఎం ఆసుపత్రి వర్గాలకు మధ్య వివాదం నడిచిందని వార్తలు వస్తుండగా, ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.

బాలు ఆసుపత్రి బిల్లు చెల్లింపు విషయంలో ఎంజిఎం ఆసుపత్రి వర్గాలకు, బాలు కుటుంబ సభ్యులకు మధ్య వివాదం నడిచినట్లు వస్తున్న పుకార్లను చరణ్ ఖండించారు. చరణ్ వీడియో సందేశం ద్వారా అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు, ఎలా పుట్టిస్తారో తెలియదు, వాళ్ళను దేవుడే కాపాడాలని ఎస్పీ చరణ్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 50రోజులకు పైగా ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విదేశీ వైద్య బృందాలు బాలు ఆరోగ్యం కోసం పనిచేశారు. అలాగే అత్యాధునిక వైద్య విధానాలు వాడారు. 

దీని వలన ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లు రూ. 3 కోట్ల వరకు అయ్యిందట. బాలు చనిపోయే నాటికి 1.85 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందట. ఈ బిల్లు విషయంలో కలుగ చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఎస్పీ చరణ్ కోరారట. ఐతే సీఎం పళని స్వామి స్పదించ లేదట. ఆసుపత్రి వర్గాలు పెండింగ్ బిల్లు చెల్లించని నేపథ్యంలో బాలు పార్దీవ దేహాన్ని అప్పగించేది లేదు అన్నారట. విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి మనవరాలు ఆసుపత్రి బిల్లు చెల్లించారని పుకార్ల సారాంశం. 

https://t.co/VVZTcF1mPx

— S. P. Charan (@charanproducer)

ఈ కథనాలు పూర్తిగా అవాస్తవం అని ఎస్పీ చరణ్ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. బిల్లు  చెల్లించిన కారణంగా ఆసుపత్రి సిబ్బంది బాలుని సరిగా పట్టించుకోలేదని వస్తున్న రాతలపై చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న చనిపోయే వరకు ఆసుపత్రి సిబ్బంది చాలా బాధ్యతగా వ్యవహరించారని చెప్పారు. ఆసుపత్రి బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్పీ చరణ్ మీడియా ముఖంగా వెల్లడించనున్నట్లు ఆ వీడియోలో తెలియజేశారు. 

click me!