ఫార్మ్ హౌజ్ కి బాలు మృత దేహం తరలింపు

By Satish ReddyFirst Published Sep 25, 2020, 9:55 PM IST
Highlights

నేడు మధ్యాహ్నం లెజెండరీ సింగర్ బాలు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంజిఎం ఆసుపత్రి నుండి బాలు మృతదేహాన్ని బాలు స్వగృహానికి తరలించారు. ఐతే కొద్దిసేపటి క్రితం మృత దేహాన్ని అక్కడ నుండి ఫార్మ్ హౌస్ కి తరలించారు.

ఎంజీఎం ఆసుపత్రి నుండి బాలు మృత దేహాన్ని చెన్నైలోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానుల దర్శనార్థం బాలు మృతదేహాన్ని అక్కడ ఉంచారు. ఐతే అభిమానుల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో బాలు పార్దీవ దేహాన్ని ఫార్మ్ హౌస్ కి తరలించారు. తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లారు. 

రేపు ఉదయం 10:30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. అప్పటి వరకు అభిమానులు బాలు మృత దేహాన్ని సందర్శించే అవకాశం కల్పించారు. రేపు అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు బాలు మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఆసుపత్రిలోనే బాలు పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతరం అయినట్లు తెలుస్తుంది. 

బాలు మరణవార్త విని దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని భాషలలో వందల పాటలు పాడిన బాలు అందరికీ సుపరిచితులే. దాదాపు 50రోజులకు పైగా బాలు మృత్యువుతో పోరాడారు. పూర్తిగా నయం అయ్యింది త్వరలో కోలుకొని బయటి వస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో బాలు ఆరోగ్యం విషమిస్థితికి చేరినట్లు చెప్పడం జరిగింది. నేడు మధ్యాహ్నం బాలు తుదిశ్వాస విడిచారని చెప్పి ఫ్యాన్స్ కి దిగ్బ్రాంతికి గురిచేశారు. 

click me!