ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్‌.. ఇంకా వెంటిలేటర్‌ మీదే బాలు!

By Satish ReddyFirst Published Sep 7, 2020, 5:10 PM IST
Highlights

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్‌. అయితే ప్రస్తుతం ఆయన లంగ్స్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఈ వారాంతానికి ఆయన పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌.

లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత నెల రోజులుగా కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై, ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతూ వస్తోంది. తాజాగా ఆయనకు కరోన టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

అయితే నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆయన ఇంకా వెంటిలెటర్‌ మీద చికిత్స పొదుతున్నట్టుగా తెలిపారు. ఎస్పీ లంగ్స్‌ ఇంకా సాధారణ స్థితికి రాలేదని, అందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వారాంతానికి ఎస్పీ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రస్తుతం ఆయన పూర్తి స్ఫృహలో ఉన్నారని తన ఐపాడ్‌లో క్రికెట్‌, టెన్నిస్‌ చూస్తున్నారని తెలిపారు.

ఎస్పీ బాలుకి కరోనా నెగటివ్... pic.twitter.com/xgot0OEVu2

— Asianetnews Telugu (@asianet_telugu)

లాస్ట్ వీకెండ్‌ అమ్మా నాన్నల యానివర్సినీ కూడా సెలబ్రేట్‌ చేసుకున్నామని తెలిపాడు చరణ్. ప్రస్తుతం ఎలాంటి సెడెసన్‌ ఇవ్వటం లేదని తెలిపిన ఎస్పీ చరణ్ ఫిజియో థెరపి మాత్రం కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

click me!