ఈ విలన్‌ రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు!

By Surya PrakashFirst Published May 12, 2020, 8:47 AM IST
Highlights

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది కార్మికులకు పని లేకుండా పోయింది.  అయితే వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చి ఎక్కడివారు అక్కడకు వెళ్లేలా కొన్ని రైళ్లను నడుపుతుంది.  ఇలాంటి సమయంలోనే నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్పమనసును చాటుకుని వార్తల్లో నిలిచారు. 

సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది కార్మికులకు పని లేకుండా పోయింది.  అయితే వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చి ఎక్కడివారు అక్కడకు వెళ్లేలా కొన్ని రైళ్లను నడుపుతుంది.  ఇలాంటి సమయంలోనే నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్పమనసును చాటుకుని వార్తల్లో నిలిచారు.  వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు స్పెషల్ గా 10 బస్సులను ఏర్పాటు చేసి, దారిలో వారికి అవసరమైన భోజనంతో పాటు వస్తు సామాగ్రిని కూడా అందించారు. 

కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన తరువాత, కర్ణాటకలోని గుల్బర్గాకు సోమవారం మహారాష్ట్రలోని థానే నుండి మొత్తం పది బస్సులు బయలుదేరాయి. వలస కార్మికులను వారి సొంతగూటికి చేర్చేందుకు ఇరు రాష్ట్రాల నుంచి ఆయనే ఫర్మిషన్స్ తీసుకోవడం విశేషం. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసిన వలస కార్మికుల విషయంలో కూడా తన శాయశక్తులా సహాయం చేస్తానని ఆయన తెలిపారు.

 ‘ప్రతి భారతీయుడు వారి కుటుంబాలు మరియు ప్రియమైనవారితో కలిసి ఉండటానికి అర్హుడు’ అని సోనూసూద్ ఈ సందర్భంగా తెలియజేస్తూ..పది బస్సులలోని వలస కార్మికులకు ప్రేమతో గుడ్ బై చెప్పారు. అలాగే వెళుతున్న వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా వారి రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని సూచించి, అందుకు అవసరమైన ఫర్మిషన్స్ ని  కూడా ఆయన తీసుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

ఇంతకు ముందు కూడా సోనూసూద్.. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు ముంబాయిలోని జుహు ప్రాంతంలోని తన హోటల్‌ ను వాడుకోవడాని ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడినుంచో వచ్చి ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. తన హోటల్‌ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపాడు.

సోనూసూద్ చేస్తున్న పనులని చూసి మీడియా, సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరు తమ వంతు సహకారం అందిస్తున్న విష‌యం తెలిసిందే. 
 

click me!