SIIMA 2021: పుష్ప 12.. అఖండ 10... సైమా నామినేషన్స్ లో జోరు చూపించిన బన్నీ, బాలయ్య!

By Sambi ReddyFirst Published Aug 17, 2022, 3:37 PM IST
Highlights

సైమా వేదికపై పుష్ప, అఖండ చిత్రాలు సందడి చేయనున్నాయి. పలు విభాగాల్లో ఈ చిత్రాలు నామినేట్ కాగా... అవార్డ్స్ పంట పండడం ఖాయంగా కనిపిస్తుంది.

2021 సంవత్సరానికి గాను సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIM Awards- 2021) కి సంబంధించిన నామినేషన్స్ ప్రకటించారు. తెలుగు నుండి పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు అత్యధిక విభాగాల్లో నామినేటై సత్తా చాటాయి. పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ కాగా... బాలయ్య అఖండ 10 విభాగాల్లో నామినేట్ అయ్యింది. పెద్ద విజయం సాధించిన చిన్న చిత్రాలు ఉప్పెన, జాతిరత్నాలు చెరో 8 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. 

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప(Pushpa) బంపర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రస్స్ వసూళ్లు సాధించి భారీ విజయం నమోదు చేసింది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప మూవీలో అల్లు అర్జున్ డీగ్లామర్ లుక్ లో ఆకట్టుకున్నారు. హిందీలో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం నమోదు చేసింది. 

ఇక అఖండ(Akhanda) మూవీతో బాలయ్య సాలిడ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ వరల్డ్ వైడ్ రూ. 120 కోట్ల గ్రాస్ సాధించింది. బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకంటే అఖండ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అఖండ మూవీలో పరాజయాలకు అడ్డుకట్ట వేశారు. 

ఇక చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించాయి ఉప్పెన, జాతిరత్నాలు. స్టార్ హీరో చిత్రాల రేంజ్ వసూళ్లు అందుకుని ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేశాయి. నిర్మాతలతో పాటు బయ్యర్ల జేబులు ఈ రెండు చిత్రాలు ఫుల్ గా నింపాయి. డెబ్యూ డైరెక్టర్స్ సానా బుచ్చిబాబు, అనుదీప్ కేవి...  ఉప్పెన, జాతిరత్నాలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2021లో గోపా చిత్రాలుగా పేరు తెచ్చుకున్న పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన సైమా నామినేషన్స్ లో సత్తా చాటాయి. 

click me!