
హై ప్రొఫైల్ పాపులేషన్ ఉండే కేబీఆర్ పార్క్ ఏరియాలో నటిపై దాడి జరగడం సంచలనంగా మారింది. రాత్రి 9:00 గంటల సమయంలో జాగింగ్ కి వెళ్లిన షాలూ చౌరాసియాపై కొందరు దుండగులు అటాక్ చేయడంతో పాటు, డబ్బులు, విలువైన వస్తువులు దోచుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఆమె గాయాలుపాలు కావడం జరిగింది, మొబైల్ అపహరించారు. ఆమెను విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు, డబ్బులు, నగలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.
కేబీఆర్ పార్క్ లో రోజూ వందల మంది జాగింగ్ చేస్తారు. నిన్న ఆదివారం సాయంత్రం షాలూ చౌరాసియా (Shalu chourasiya) పార్క్ కి జాగింగ్ కి వెళ్లడం జరిగింది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు, చేతిలో ఉన్న మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. చౌరాసియా పై ముగ్గురు దాడి చేసినట్లు ఆమె వెల్లడించారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారని, బండరాయితో తలపై మోదే ప్రయత్నం చేయడంతో పాటు తన దగ్గర వున్న నగదు, ఆభరణాలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. చివరికి ఆమె కేకలు వేయడంతో మొబైల్ తీసుకొని, పారిపోవడం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా... అటు వైపు ఉన్న కెమెరా పని చేయకపోవడంతో ఘటన రికార్డు కాలేదని తెలుస్తుంది. మరో వైపు ఉన్న కెమెరాలో నటి చౌరాసియా, దాడి అనంతరం పరిగెడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీనితో పక్కనే ఉన్న స్టార్ బక్స్, తాజ్ హోటల్ సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కేబీఆర్ పార్క్ (KBR park) ఔటర్ ట్రాక్ కొన్ని చోట్ల చీకటిగా ఉంటుంది. నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్న కొందరు దోపిడీ దొంగలు, అటుగా వెళుతున్న వారిపై దాడులకు పాల్పడి, చోరీలు చేస్తున్నారని సమాచారం. చౌరాసియా పై దాడి జరిగిన ప్రాంతంలో గతంలో కూడా ఈ తరహా నేరాలు జరిగినట్లు తెలుస్తుంది. ఆరుగురు వ్యక్తులు ఓ బైకర్ పై దాడి చేసి డబ్బులు, బైక్ దొంగిలించి పారిపోయారని సమాచారం. ఈ దాడులకు పాల్పడిన వారిలో కొందరిని గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే మరలా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Also read RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మాస్ సాంగ్.. ‘నాటు’ కాపీయా... ?
ఈ దాడిలో నటి చౌరాసియా స్వల్ప గాయాలుపాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అనంతరం డైల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత సెక్యూర్డ్ గా ఉండే ఏరియాలో ఈ తరహా నేరాలు జరగడం సంచలనంగా మారింది.