కాజల్ అగర్వాల్ అవుట్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త్రిష

pratap reddy   | Asianet News
Published : Nov 15, 2021, 02:21 PM IST
కాజల్ అగర్వాల్ అవుట్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త్రిష

సారాంశం

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం ఇండియన్ 2 చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం ఇండియన్ 2 చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇండియన్ 2 షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు యూనిట్ సభ్యులు మరణించారు. స్వయంగా దర్శకుడు శంకర్ గాయపడ్డారు. 

ఆ తర్వాత Shankar కు, ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో Indian 2 దాదాపుగా అటకెక్కినంత పని అయింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో తిరిగి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం శంకర్ రాంచరణ్ మూవీతో బిజీగా ఉన్నారు. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఇండియన్ 2 చిత్రాన్ని కూడా ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

అయితే తాజాగా శంకర్ కి మరో సమస్య వచ్చింది. ఇండియన్ 2 షూటింగ్ చాలా ఆలస్యం అవుతుండడంతో డేట్లు అడ్జెస్ట్ చేయలేక Kajal Aggarwal ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాజల్ ప్లేస్ లోకి చెన్నై ముద్దుగుమ్మ త్రిషని శంకర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు కాజల్ పై చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ త్రిషతో రీషూట్ చేయాల్సి ఉంది. అలాగే నటుడు వివేక్ కూడా ఆ మధ్య మరణించారు. దీనితో ఆయన సన్నివేశాల్ని కూడా వేరో నటుడితో రీ షూట్ చేయక తప్పదు. 

Also read: RRR Movie: బిగ్ న్యూస్.. రాజమౌళి కోసం పోటీ నుంచి తప్పుకున్న అలియా భట్

దాదాపు పాతికేళ్ల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ చిత్రం అఖండ విజయం సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో జీవించారు. ఇన్నేళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుండడంతో ఆసక్తి నెలకొంది. 

Also Read: పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీ తాత మళ్ళీ పుట్టాడు రా.. జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా, సెట్ లో చప్పట్లు కొడుతూ ఉండిపోయిన సీనియర్ నటుడు
50 ఏళ్ల అభిషేక్ కు భార్య ఐశ్వర్య రాయ్ స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్, ఫిదా చేసిందిగా?