పోలీస్ దెబ్బ అదుర్స్ కదా.. ఎన్టీఆర్ EMK షోలో కోటి గెలుచుకున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే

By telugu team  |  First Published Nov 15, 2021, 3:15 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu) షో తుది దశకు చేరుకుంది. మరికొన్ని ఎపిసోడ్స్ తో ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగియనున్నట్లు తెలుస్తోంది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Koteeswarulu) షో తుది దశకు చేరుకుంది. మరికొన్ని ఎపిసోడ్స్ తో ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తన హోస్టింగ్ తో అదరగొడుతున్నప్పటికీ షోలో పెద్దగా మెరుపులు లేవు. అప్పుడప్పుడూ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు అంతే. 

ఈ షోలో ఇప్పటి వరకు పాల్గొన్న కంటెస్టెంట్స్ తక్కువ మొత్తం మాత్రమే గెలుచుకుని వెనుదిరిగారు. దీనితో ప్రేక్షకులకు జోష్ లేకుండా పోయింది. ఇక షో చివరి దశకు చేరుకుంటున్న సమయంలో అద్భుతం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చివరి ప్రశ్న వరకు వెళ్లి దిగ్విజయంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. దానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అయితే ప్రోమోలో ఆ వ్యక్తి వివరాలు రివీల్ చేయలేదు. 

Latest Videos

కానీ తాజాగా ఆ వ్యక్తి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ షోలో కోటి గెలుచుకున్న వ్యక్తి పేరు బి.రాజా రవీంద్ర. 33 ఏళ్ల వయసున్న ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం. రాజా రవీంద్ర ప్రస్తుతం పోలీస్ శాఖలో  సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్నారు కాబట్టి సహజంగానే క్రీడల్లో రాజా రవీంద్రకు మంచి పట్టు ఉంది. 

ముఖ్యంగా ఆయన ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ప్రొఫెషనల్. పోలీస్ క్రీడల్లో భాగంగా ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలుచుకున్నారు. ఈరోజుకైనా ఒలంపిక్స్ లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ఇండియాకు మెడల్ సాధించాలనేదే రాజా రవీంద్ర జీవిత లక్ష్యం. అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదు ఉపయోగిస్తానని అన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో విజేతగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ గా ఉండే వ్యక్తి మనసు పెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుందని నెటిజన్లు అభినందిస్తున్నారు. 

Also Read: RRR Movie: బిగ్ న్యూస్.. రాజమౌళి కోసం పోటీ నుంచి తప్పుకున్న అలియా భట్

ఈ క్రేజీ ఎపిసోడ్ నేడు, రేపు ప్రసారం కానుంది. ఎన్టీఆర్ సంధించే ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు రాజా రవీంద్ర చెప్పే సమాధానాలు గురించి తెలుసుకోవాలంటే ఈ రెండు రోజులు ఎవరు మీలో కోటీశ్వరులు షో చూడాల్సిందే. కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్ర ఆట ఎలా సాగింది. ఆయన లైఫ్ లైన్స్ ఉపయోగించుకున్నారా లేదా అనేవి ఆసక్తికర అంశాలు. 

ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగష్టు లో ప్రారంభం అయింది. తొలి ఎపిసోడ్ కు రాంచరణ్ అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో కొరటాల శివ, రాజమౌళి.. సమంత.. దేవిశ్రీ, తమన్ లాంటి సెలెబ్రిటీలు అతిథులుగా హాజరు కావడం విశేషం. 

click me!