ఇండియన్ 2 మూవీ కి ముహూర్తం ఫిక్స్, షూట్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?

By Mahesh JujjuriFirst Published Aug 19, 2022, 10:16 PM IST
Highlights

లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఇండియన్2 మూవీ నుంచి అప్ డేట్ వచ్చేసింది.  ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు మేకర్స్.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ కి  ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఎప్పుడో ఆగిపోయిన సినిమాకు మోక్షం లభించనుంది. దాదాపుగా ఈనెల 25 నుంచి సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. 

లోక నాయకుడు కమలహాసన్  హీరోగా  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్2. గతంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కి  సంచలన విజయాన్ని సాధించిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇక ఎప్పుడో రిలీజ్ అయిన  ఆ సినిమాను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. యాక్టింగ్ పరంగా, మెసేజ్ పరంగా, సెన్సేషనల్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. ఆడియన్స్ కు ఎవరగ్రీన్ పిక్చర్ గా నిలిచిపోయింది సినిమా. 

ఇక ఇంత కాలానికి ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 ప్రాజెక్టును శంకర్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. కొంతవరకూ  షూటింగ్ చేసుకున్న తరువాత .. ఈసినిమాకు వరుసగా కష్టాలు మొదలయ్యాయి. దాదాపు  30 శాతం షూటింగ్ జరిగిన తరువాత.. కొన్ని ప్రమాదాలు, నిర్మాతలకు, దర్శకుడికి మధ్య వచ్చిన వివాదాల తో పాటు మరి కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. దాంతో చరణ్ ప్రాజెక్టును శంకర్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా ఎనిమిదికి పైగా షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. 

ఈ సమయంలోనే  ఇండియన్ 2 సినిమా షూటింగ్ కు వివాదాలు సమసిపోయి.. లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమాకు  సంబంధించిన సమస్య తొలగిపోయింది. దాంతో ఇండియన్2 తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 25 నుంచి ప్లాన్ చేసినట్టుగా సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడు. కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ఒక కీలకమైన పాత్రలో మెరవనుంది. అయితే కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో అప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కాని ఇప్పుడు మళ్లీ ఈ మూవీలో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. 

ఇక ఈసినిమా కోసం కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు. అక్కడ ఈ సినిమాకు తగ్గట్టు మేకోవర్ అయ్యాడు. త్వరలో ఇండియాకు రాబోతున్నాడు. ఇటు రామ్ చరణ్ తో సినిమాకు బ్రేక్ ఇచ్చి.. కమల్ షూటింగ్ ను కంప్లీట్ చేయబో్తున్నాడు శంకర్. ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

click me!