సీనియ‌ర్ న‌టుడు రావి కొండ‌ల‌రావు మృతి

By Surya PrakashFirst Published Jul 28, 2020, 5:57 PM IST
Highlights

ప్ర‌ముఖ  సినీ న‌టులు రావి కొండ‌లరావు క‌న్నుమూశారు. రావికొండ‌ల రావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు . ఆయ‌న  సినీ నటుడుగానే కాకుండా రచయితగానూ మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు.

ఆయన రాసిన కథలూ, నవలలూ, సినిమా నవలలూ, వ్యాసాలూ, నాటికలూ నాటకాలూ.. అన్నీ ఓ జాబితాకు ఎక్కిస్తే వందలకు వందలు దాటుతాయి. ఆయన రచనలు విలక్షణంగా ఉంటాయి. సులభంగా, సరళంగా, ఆహ్లాదకరంగా... అచ్చం ఆయనలానే ఉంటాయి. 

ఇటు రంగస్థలంపైనా, అటు వెండితెరపైనా. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, గుమ్మడి, భానుమతి వంటి ఉద్ధండులతో కలిసి నటించారు. రాముడు భీముడు, తేనె మ‌న‌సులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొంగ‌లు, అందాల రాముడు, ద‌స‌రా బుల్లోడు చిత్రాలు స‌హా 600కు పైగా చిత్రాల్లో న‌టించి అంద‌రి అభిమానం చూర‌గొన్నారు. గతంలో భైరవద్వీపం, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు సహనిర్మాతగానూ వ్యవహరించారు. రావి కొండలరావు అర్ధాంగి రాధా కుమారి కూడా తెలుగు నటిగా సుపరిచితురాలు. ఆమె ఎనిమిదేళ్ల కిందటే కన్నుమూశారు.రావికొండ‌ల రావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 

click me!