బిగ్ బాస్ ప్రేమ: తేజస్వికి సామ్రాట్ ఫ్యామిలీ వార్నింగ్!

By Udayavani DhuliFirst Published Oct 4, 2018, 4:40 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 లో హౌస్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే సామ్రాట్, తేజస్విచాలా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. అది కేవలం స్నేహమని వారు ఎంతగా చెబుతున్నా ఆడియన్స్ కి మాత్రం మరో రిలేషన్షిప్ మాదిరిగానే పోట్రే అయింది.

బిగ్ బాస్ సీజన్ 2 లో హౌస్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే సామ్రాట్, తేజస్విచాలా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. అది కేవలం స్నేహమని వారు ఎంతగా చెబుతున్నా ఆడియన్స్ కి మాత్రం మరో రిలేషన్షిప్ మాదిరిగానే పోట్రే అయింది.

హౌస్ లో వీరిద్దరూ విడివిడిగా కనిపించింది లేదు. తరచూ సామ్రాట్ చేయి పట్టుకొని అతడి వెంటే తిరిగేది తేజస్వి. ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పుడు కూడా సామ్రాట్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కానీ ఆ తరువాత ఆమె టాపిక్ కూడా పెద్దగా తీసుకురాలేదు. నిజానికి హౌస్ లో ఉన్నప్పుడే సామ్రాట్ తల్లి అతడికి ఫోన్ చేసి తేజస్వికి దూరంగా ఉండమని పరోక్షంగా చెప్పింది.

ఫైనల్స్ సమయంలో తిరిగి హౌస్ లోకి వెళ్లిన తేజస్వి.. సామ్రాట్ కి దూరంగా ఉన్నట్లు ప్రవర్తించింది. దానికి కారణం తేజస్వి బయటకి రాగానే సామ్రాట్ ఫ్యామిలీ నుండి ఆమెకి వార్నింగ్ వెళ్లిందట. దాంతో భయపడి ఆమె సామ్రాట్ కి దూరంగా ఉందని టాక్.

తనీష్ తో క్లోజ్ గా కనిపించింది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత కూడా తేజస్వి.. సామ్రాట్ తో కలిసి ఎక్కడా కనిపించలేదు. ఆమె కూడా తిరిగి తమ రిలేషన్ ని మొదలుపెట్టడం పట్ల ఆసక్తి చూపడం లేదని సమాచారం. 

ఇవి కూడా చదవండి.. 

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

click me!