కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

By Udayavani DhuliFirst Published Oct 4, 2018, 3:56 PM IST
Highlights

బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇది ఫేక్ ఆర్మీ అని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా.. వారు మాత్రం ఎప్పటికప్పుడు కౌశల్ మీద ప్రేమ చాటుతూనే ఉన్నారు.

బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. ఇది ఫేక్ ఆర్మీ అని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నా.. వారు మాత్రం ఎప్పటికప్పుడు కౌశల్ మీద ప్రేమ చాటుతూనే ఉన్నారు. 

ఆయన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిమానులు ఆయన ఎక్కడికి వెళ్తున్నా విడిచిపెట్టడం లేదు. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లిన కౌశల్ ని అభిమానులు చుట్టుముట్టారు. ఈ ప్రారంభోత్సవానికి కౌశల్ తో పాటు Rx100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా వచ్చింది. 

అయితే కౌశల్ ఫాలోయింగ్ ముందు ఆమె ఎక్కడా కనిపించలేదు. కౌశల్ కారుని అభిమానులంతా చుట్టుముట్టడంతో అతడు వారి నుండి తప్పించుకొని వెళ్లడానికి చాలా సమయమే పట్టింది. కౌశల్, కౌశల్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లన్నీ బ్లాక్ చేశారు అభిమానులు.

బహుసా కౌశల్ కూడా ఇంతటి అభిమానాన్ని ఊహించి ఉండడు. ఆయనకి దక్కుతోన్న ప్రేక్షకాదరణ హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

What a craze macha 😱😱😱😱😱💕💕💕💕

A post shared by Telugu Meme Page (@lite_ba) on Oct 4, 2018 at 2:36am PDT

ఇవి కూడా చదవండి.. 

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని: కౌశల్ కామెంట్స్!

click me!