'అత్తారింటికి దారేది' కో ప్రొడ్యూసర్ కు కరోనా పాజిటివ్

By Surya PrakashFirst Published Jun 3, 2020, 7:32 PM IST
Highlights

ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ అదే బాలీవుడ్ కు చెందిన మరో వెర్సిటైల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆతరవాత మరో బాలీవుడ్ నిర్మాతకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మాత కరీంమొరానీ  తో సహా ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. ఇటీవలే మ్యూజిక్ కంపోజర్ వైరస్ వల్ల మృతి చెందగా ఆయన తల్లికి కూడా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

కరోనా మహమ్మారి బాలీవుడ్ ను బెంబేలిత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ అదే బాలీవుడ్ కు చెందిన మరో వెర్సిటైల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆతరవాత మరో బాలీవుడ్ నిర్మాతకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మాత కరీంమొరానీ  తో సహా ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. ఇటీవలే మ్యూజిక్ కంపోజర్ వైరస్ వల్ల మృతి చెందగా ఆయన తల్లికి కూడా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

 ఇదిగో ఇప్పుడు హిందీ, తెలుగుతో సహా అనేక భాషల్లో సినిమాలు తీస్తూ వస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్ద రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆ సెగ తగిలింది. ఈ సంస్ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  శిబాశిష్ సర్కార్ కు కరోనా పాజిటివ్ అని తేలటంతో ముంబైలోని హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

సర్కార్ ..పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన అత్తారింటికి దారేది చిత్రంకు సహ నిర్మాతగా వ్యవహరించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల తీవ్రమైన జ్వరం రావడంతో హాస్పిటల్ కు వెళ్లటం జరిగింది. అక్కడ డాక్టర్లు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం ఆయన ముంబయిలోని ప్రముఖ హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. రియన్స్ ఎంటర్ టైన్ మెంట్ అనేక పెద్ద బాలీవుడ్ చిత్రాలను నిర్మించడం వెనుక శిబాశిష్ సర్కార్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో ఈయన 83, సూర్యవంశీ సినిమాలను కూడా నిర్మించాడు. 83 చిత్రం విడుదలకు రెడీ అవ్వగా వైరస్ కారణంగా వాయిదా వేశారు. 

click me!