ఏడాదిలో వంద పోర్న్ వీడియోలు.. శిల్పా, షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌, సాగరికలను ప్రశ్నించనున్న పోలీసులు

By Aithagoni RajuFirst Published Jul 23, 2021, 5:46 PM IST
Highlights

రాజ్‌కుంద్రా గత ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు చిత్రీకరించినట్టు తాజా విచారణలో బయటపడింది. ఈ కేసులో శిల్పాశెట్టి, షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌ పాండే, సాగరికలను పోలీసులు ప్రశ్నించనున్నారు.

నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్ది డొంక కదిలినట్టు అనేక విషయాలు బయటపడుతున్నాయి. రాజ్‌కుంద్రా గత ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు చిత్రీకరించినట్టు  బయటపడింది. క్రైమ్‌ పోలీసులు శుక్రవారం జుహులోని రాజ్‌కుంద్రా ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇందులో 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లకు డీల్‌ కుదుర్చుకున్నట్లు వాట్సాప్‌ చాట్‌లో కనుగొన్నామని పోలీసులు తెలిపారు. ఈ డీలింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ రాజ్‌కుంద్రా వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా వెల్లడైనట్టు తెలిపారు. 

అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా మధ్య లావాదేవీలను విచారించాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వరకు రాజ్‌కుంద్రాని తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

అయితే విచారణకి రాజ్‌కుంద్రా సహకరించడం లేదని, అనేక విషయాలపై ఆయన నోరు విప్పడం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత క్షుణ్ణంగా విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టిని కూడా విచారించబోతున్నారట. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్లాన్‌ జరుగుతున్నట్టు సమాచారం. అలాగే ఆరోపణలు చేసిన షెర్లిన్‌ చోప్రా, పూనమ్ పాండే, సాగరికలను సైతం ప్రశ్నించేందుకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. 

రాజ్‌కుంద్రా తన యాప్‌ల ద్వారా ఈ పోర్న్ వీడియోలు సోషల్‌ మీడియాలోకి పోస్ట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ యాప్‌కి దాదాపు రెండు మిలియన్ల(ఇరవై లక్షలు) సబ్‌ స్క్రైబర్లు ఉండటం గమనార్హం. ఇది పోలీసులను సైతం షాక్‌కి గురి చేస్తుందట. ఇదిలా ఉంటే నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రా సోమవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌ని ముంబయి కోర్ట్ శుక్రవారం తిరస్కరించింది. 
 

click me!