ఖాళీగా ఉన్న దర్శకులకు పూరి ఆర్ధిక సాయం!

Published : Sep 27, 2019, 03:53 PM IST
ఖాళీగా ఉన్న దర్శకులకు పూరి ఆర్ధిక సాయం!

సారాంశం

‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో మంచి జోష్ మీద ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డైరెక్టర్లు, కో-డైరెక్టర్లకు సాయం అందించాలని నిర్ణయించారు.  

సినిమాల మీద ఆసక్తితో ఎక్కడెక్కడినుండో వచ్చి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పని దొరకాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమందికి సినిమా చాన్స్ వచ్చినా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ కాలేదు.

ఇలా ఒకట్రెండు సినిమాలు చేసి ఆ తరువాత అవకాశాలు లేక రోడ్డెక్కిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లలో నటులు, దర్శకులు, రచయితలు ఇలా అందరూ ఉంటారు. అలాంటి వారిని ఆర్థికంగా ఆడుకోవడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. 

ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఓ ఇరవై మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లకు ఆర్ధిక సాయం అందించేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి ముందుకొచ్చారు. ఈ మేరకు తమ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ పేరిట మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం(సెప్టెంబర్ 28) నాడు పూరి పుట్టినరోజుని పురస్కరించుకొని వారందరికీ సాయం అందించబోతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమా ద్భుత విజయాన్ని పురస్కరించుకొని, ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలనిపించిందని అందుకే కష్టపడి పనిచేసిన డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్ 20 మందికి తమ వంతు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నామని చెప్పారు. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే