ఎవరినీ వదిలిపెట్టం.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత వార్నింగ్!

By AN TeluguFirst Published Apr 29, 2019, 3:04 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో మే 1న విడుదల చేసుకోమని చెప్పడంతో దర్శకనిర్మాతలు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్స్ నిర్వహించాలని అనుకున్నారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో మే 1న విడుదల చేసుకోమని చెప్పడంతో దర్శకనిర్మాతలు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్స్ నిర్వహించాలని అనుకున్నారు. 

కానీ దాన్ని ఏపీ పోలీసులు వ్యతిరేకించడంతో దర్శకుడు వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డి తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి ఏపీ పోలీసులు, అక్కడి అధికారులపై మండిపడ్డారు. విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి వెళ్లిన తమను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని చంపేశారంటూ నిర్మాత రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.

పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని తమను అడ్డుకున్నారని, దీని వెనుక ఉన్న ముఖ్య నాయకులందరినీ బయటకి తీసుకొస్తామని, తప్పకుండ పోరాటం చేస్తామని అన్నారు. సినిమా 
విడుదలైన తరువాత ఎవరినీ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. 

ఇప్పటికే తెలంగాణాలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. ఆంద్రలో ప్రజలు ఇంకా పెద్ద గిఫ్ట్ ఇస్తారని.. దీని పరిణామాలు మే 23వ తేదీన ఎదుర్కొంటారని పరోక్షంగా టీడీపీ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. 

ఏపీకి వెళ్లాలంటే వీసా తీసుకోవాలా..? వర్మ ఫైర్!

వర్మ చేసిన తప్పేమిటి: బాబు ప్రభుత్వంపై జగన్ ఫైర్

7 గంటల హైడ్రామా: బలవంతంగా హైదరాబాదుకు వర్మ తరలింపు

నేను పోలీస్ కస్టడీలో ఉన్నా.. వీడియో షేర్ చేసిన వర్మ!

బెజవాడలో ఆర్జీవీ అరెస్ట్: వర్మకు వైసీపీ నేతల మద్ధతు

అందుకే వర్మను అడ్డుకొన్నాం: విజయవాడ పోలీసులు

బెజవాడలో రామ్‌గోపాల్ వర్మ హైడ్రామా, అదుపులోకి తీసుకొన్న పోలీసులు

click me!