PSPK28 ప్రీ లుక్: కొంచెం జోష్.. కొంచెం నిరాశ.. పవన్ ని దాచేసిన హరీష్

By telugu teamFirst Published Sep 2, 2021, 5:17 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుస అప్డేట్లు వస్తున్నాయి. భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది. హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి - పవన్ మూవీ నుంచి కూడా అప్డేట్లు వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వరుస అప్డేట్లు వస్తున్నాయి. భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది. హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి - పవన్ మూవీ నుంచి కూడా అప్డేట్లు వచ్చాయి. తాజాగా మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ PSPK28 నుంచి ప్రీ లుక్ రిలీజయింది. 

హార్లీ డేవిడ్సన్ బైక్ పై స్టైల్ గా కూర్చుని ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సగమే చూపించారు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్. మళ్ళీ ఫుల్లీ లోడింగ్ అని పెట్టారు. దీనితో ఫ్యాన్స్ కి కొంచెం జోష్ కొంచెం.. కొంచెం నిరాశ కలిగించినట్లు అయింది.  గబ్బర్ సింగ్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

ప్రకటనతోనే భారీ హైప్ వచ్చింది. తమ కాంబినేషన్ పై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా హరీష్ శంకర్ కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే 'దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్' అని ప్రతి పోస్టర్ లో వేస్తున్నారు. 

పవన్ అభిమానులు కోరుకునే వినోదాత్మక అంశాలతో పాటు హరీష్ శంకర్ బలమైన కథ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నారనేది ఒక రూమర్. దసరా నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

Many More Happy Returns to

The One and Only.....
🤗🤗🤗🤗🤗 SHURU pic.twitter.com/fVpG8WlJOz

— Harish Shankar .S (@harish2you)
click me!