విజయ్ కి షాక్.. స్పెషల్ షో ఒకటి మాత్రమే..!

By Udayavani DhuliFirst Published Nov 5, 2018, 11:44 AM IST
Highlights

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకి స్పెషల్ షోలు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. అయితే తమిళనాడు చలనచిత్ర పంపిణీదారుల సంఘం విజ్ఞప్తి మేరకు దీపావళి రోజుతో పాటు 7, 8, 9 తేదీల్లో థియేటర్లో ఒక్క స్పెషల్ షోకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాకి స్పెషల్ షోలు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. అయితే తమిళనాడు చలనచిత్ర పంపిణీదారుల సంఘం విజ్ఞప్తి మేరకు దీపావళి రోజుతో పాటు 7, 8, 9 తేదీల్లో థియేటర్లో ఒక్క స్పెషల్ షోకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం జీవోని విడుదల చేసింది. దీని ప్రకారం ఒకరోజు కేవలం ఐదు షోల ప్రదర్శనకు మాత్రమే అనుమతి లభించింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో మొదటి వారం మొత్తం ఆరు లేదా ఏడు షోలు వేస్తుంటారు. గతంలో తమిళ ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చేది. కానీ ఆ అవకాశం విజయ్ 'సర్కార్' కి దక్కలేదు.

రోజుకి నాలుగు రెగ్యులర్ షోలు, ఒక స్పెషల్ షోతో కలిపి మొత్తం ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో అభిమానులు నిరాశకి గురయ్యారు. స్పెషల్ షోలు, బెనిఫిట్ షోల కారణంగా ప్రేక్షకులకు టికెట్లను భారీ ధరకి విక్రయించడం, తెల్లవారు జామునే షోలు ప్రారంభించడం వలన ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై స్పందించిన ప్రభుత్వం దీపావళికి విడుదలయ్యే సినిమాలపై పలు షరతులు విధించింది. స్పెషల్ షోలు వేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు చలనచిత్ర డిస్ట్రిబ్యూటర్ల సంఘం ముఖ్యమంత్రిని కలిసి స్పెషల్ షోకి అనుమతి కోరడంతో ఒక స్పెషల్ షో అది కూడా నాలుగు రోజులకి మాత్రమే అనుమతినిచ్చారు. 

ఇవి కూడా చదవండి.. 

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!

click me!