బ్లాస్టింగ్ అప్డేట్... పవన్ బర్త్ డే ట్రీట్,  హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!

By team teluguFirst Published Sep 2, 2021, 2:50 PM IST
Highlights

పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 2022  ఏప్రిల్ 29న హరిహర వీరమల్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' సినిమా యూనిట్ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. హరిహర వీరమల్లు విడుదల తేదీ ప్రకటించేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇది వరకే వెల్లడించింది. అయితే నేడు తేదీతో సహా అధికారిక ప్రకటన చేశారు.  పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. 2022  ఏప్రిల్ 29న హరిహర వీరమల్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 

పవన్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' కాగా, దాదాపు రూ. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఇక పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా కనిపిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలు నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. 

కొద్దిసేపటి క్రితం విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ దుమ్ము రేపుతోంది. సంగీత దర్శకుడు థమన్ స్వరాలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఆకట్టుకున్నాయి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ మూవీలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా నిత్యా మీనన్ నటించడం విశేషం. భీమ్లా నాయక్ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు,  స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు సమాచారం. 


 

Someone who always thinks about d society n serves habitually in any event with such pride n conviction like u do deserve d world n more sir.

You are, and always will be, a true hero n it’s an honour to be wishing you well on your birthday 💐💐 pic.twitter.com/O5Gqk35v61

— Krish Jagarlamudi (@DirKrish)
click me!