త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

By Udayavani DhuliFirst Published Oct 18, 2018, 3:42 PM IST
Highlights

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తం సీరియస్ సాగే కథ. దీంతో కామెడీకి స్కోప్ ఎక్కువ లేదు. అయినప్పటికీ త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ పండించడానికి ప్రయత్నించాడు. 

ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తం సీరియస్ సాగే కథ. దీంతో కామెడీకి స్కోప్ ఎక్కువ లేదు. అయినప్పటికీ త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ పండించడానికి ప్రయత్నించాడు.

అయితే ఆశించిన స్థాయిలో లేకపోవడం త్రివిక్రమ్ పై విమర్శలు బాగా వినిపించాయి. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ''అరవింద సమేత ఒక సీరియస్ స్టోరీ.. ఇలాంటి కథలో కామెడీ ఉండాలని ఎందుకు  కోరుకుంటున్నారు..? త్రివిక్రమ్ ఏమైనా కామెడీ డైరెక్టరా..? ఆయన్ను ఎందుకు ఒక చట్రంలో బిగించాలని అనుకుంటారు.

ఆయన ఎలాంటి జోనర్ సినిమానైనా తీయగలడు. ఈసారి సీరియస్ కథ ఎన్నుకున్నాడు. ఈ కథలో హీరో తండ్రి పోగొట్టుకొని విషాదంలో సిటీకి వస్తాడు. అతడు ఎలా కామెడీ చేస్తాడు.. చుట్టూ ఉన్న పాత్రలతో ఎక్కువ కామెడీ చేయించినా.. వర్కవుట్ కాదు.

అప్పటికీ నరేశ్ గారితో, రౌడీ బ్యాచ్ తో కొంత కామెడీ చేసే ప్రయత్నం చేశారు. అవి తెరపై బాగా పండాయి. కథ సీరియస్ గా ఉండాలని కామెడీ డోస్ ఎక్కువ పెంచలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

click me!