పందెం వేశారు కానీ... (పందెం కోడి-2 రివ్యూ)

By pratap reddy  |  First Published Oct 18, 2018, 2:49 PM IST

విశాల్ హీరోగా పందెం కోడి  సినిమా వచ్చి  చాలా కాలం అయ్యింది. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ అంటూ ఓ చిత్రాన్ని రెడీ చేసి వదిలారు. 


---సూర్య ప్రకాష్ జోశ్యుల


సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోందంటే ఎంతో కొంత అంచనాలు ఉంటాయి.  అయితే ఆ హిట్ సినిమా వచ్చిన ఒకటి రెండేళ్లలో సీక్వెల్ వస్తే... జనాలకు గుర్తు ఉంటుంది. ఆ సాగా కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా డైరక్టర్ కో, హీరోకో హిట్ అవసరం అయినప్పుడు తన పాత హిట్ సినిమాని వెతికి దానికి సీక్వెల్ తీస్తున్నామని ప్రకటిస్తే... ఫలితం నామ మాత్రమే.  ఎందుకంటే ఆ సినిమా ఒకటి అప్పట్లో వచ్చిందని ఇప్పటి జనాలకు గుర్తు చేయాలి. అది పెద్ద హిట్టైందని సమాచారం ఇవ్వాలి. అప్పుడు సీక్వెల్ కు శ్రీకారం చుట్టాలి. 

Latest Videos

undefined

విశాల్ హీరోగా పందెం కోడి  సినిమా వచ్చి  చాలా కాలం అయ్యింది. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ అంటూ ఓ చిత్రాన్ని రెడీ చేసి వదిలారు. ఇంతకీ ఈ చిత్రం.. పందెం కోడి కథకు కంటిన్యూయేషనా లేక కేవలం పాత్రలనే తీసుకున్నారా... అసలు కథేంటి... తమిళ డబ్బింగ్ గా వచ్చిన ఈ చిత్రం మనవాళ్లకు ఎంత వరకు ఎక్కే అవకాశం ఉంటుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

                                 

ఇదే స్టోరీ లైన్


కడ‌ప ప్రాంతంలో కొన్ని గ్రామాలకు పెద్ద రాజారెడ్డి(రాజ్‌కిర‌ణ్‌). ఆయన మాటే అక్కడ శాసనం. అక్కడ గ్రామాల్లో జనం చిన్న చిన్న విషయాలకే నరుక్కుంటూ ఉంటారు. అక్కడ వీరభద్రుడు జాతర జరుగుతూంటుంది. ఆ క్రమంలో   భోజనాలు పెడితే  ముక్క  గురించి గొడవై .. ముక్కలుగా నరికేసుకునేదాకా వెళ్తుంది.  చివరకి ఆ గొడవ రెండు ఊళ్ల మధ్యన.. రెండు కుటుంబాల మధ్య గొడవగా మారుతుంది.  అప్పటినుంచి గత ఏడేళ్లుగా ఆ గ్రామాల్లో జాతర జరగదు. కోర్టు జాతర జరగటానికి వీల్లేదని అంటుంది. 

ఇక ఆ గొడవల్లో భర్తని కోల్పోయిన  భ‌వాని (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) .. అతన్ని చంపిన కుటుంబానికి వారసుడు లేకుండా చేయాలని అందరిని చంపించే పోగ్రాం పెట్టుకుంటుంది. ఆ క్రమంలో ఒక కుర్రాడు తప్ప అందరూ హత్య చేయబడతారు. ఆ కుర్రాడిని కరెక్ట్ గా చంపే సమయానికి రాజారెడ్డి అడ్డుపడి రక్షించి అభయమిస్తాడు. అక్కడ నుంచి ఆ కుర్రాడిని చంపాలని భవాని .. కుటుంబం ప్రయత్నాలుల చేస్తూంటుంది. 

ఈ లోగా...ఆగిపోయిన జాతరను తిరిగి మొదలెట్టాలని లీగల్ గా కోర్టుల చుట్టూ తిరిగి... రాజారెడ్డి  ఏర్పాట్లు చేస్తాడు. అయితే అదే జాతరలో ... ఆ మిగిలిన కుర్రాడిని ఏసెయ్యాలని భవాని ఫ్యామిలీ ఫిక్స్ అవుతుంది. ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో భ‌వాని, ఆమె మ‌నుషులు ఆ కుర్రాడిని చంపాల‌నున్నారనే  విషయం తెలిసిన రాజారెడ్డి తన ఇంట్లోనే ఆ కుర్రాడిని పెట్టుకుని కాపాడాలనుకుంటాడు.  ఇదీ  కథ నేపథ్యం.

ఇక జాతరకు గత ఏడేళ్లుగా .. విదేశాల్లో ఉంటున్న బాలు(విశాల్) తన  ఊరొస్తాడు. బాలు.. రాజారెడ్డి కొడుకు. ఊరికి రాగానే ఈ విషయం తెలుస్తుంది. అక్కడ నుంచి తన తండ్రి తీసుకున్న భాధ్యత అయిన ఆ కుర్రాడిని రక్షించటం తను తీసుకుంటాడు. రాజారెడ్డికి అది ఇష్టం ఉండదు. ఈలోగా శత్రువులు.. ఆ కుర్రాడని చంపబోయి రాజారెడ్డిపై ఎటాక్ చేస్తారు. దాదాపు ప్రాణం పోయే స్దితిలో ఉన్న రాజారెడ్డి.. ఎట్టి పరిస్దితుల్లోనూ జాతర ఆగటానికి వీల్లేదని కొడుకు దగ్గర నుంచి మాట తీసుకుంటాడు. 

ఇలా తన తండ్రిపై ఎటాక్ జరిగిందని తెలిస్తే జనం కత్తులు తీస్తారు. ఈ విషయం అర్దం చేసుకున్న  బాలు ఏం నిర్ణయం తీసుకున్నాడు... భవాని ఏం చేసింది... జాతరను జరిపించారా .. ఆ కుర్రాడిని ప్రత్యర్దులు చంపేయకుండా కాపాడుకున్నారా.. ఇంతకీ ఈ కథలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

                                

విషయం ఇల్లే...

పందెం కోడి సీక్వెల్ అంటూ మొదలెట్టిన ఈ సినిమా కథలో  పస లేదనే చెప్పాలి. ఎంతసేపూ.. నెగిటివ్ పాత్ర చేసిన వరలక్ష్మి.. వాళ్లని చంపేయాలని అరుస్తూంటుంది. హీరో ...నేను రక్షిస్తాను అంటూంటారు. ఎవరు ఏదీ చెయ్యరు. ముఖ్యంగా విశాల్ సమస్యలోకి వచ్చే సరికే ఇంటర్వెల్ దాటిపోయింది. ఆ తర్వాత అయినా విశాల్ ఏమన్నా చేస్తాడా అంటే ఏమీ ఉండదు. ముఖ్యంగా మొదటి పదినిముషాలకే కథ మొత్తం అర్దమైపోతుంది. 

పందెం కోడి సమయానికి విశాల్ అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో. అతని ఇమేజ్ కు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యే కథ అది. ఇప్పుడు ఆల్రెడీ హీరోగా ప్రూవ్ అయిన వాడు. ఇంకా తండ్రి చాటు బిడ్డగా...కథను నడుపుతాను... అంటే అతని నించి ఎక్స్ పెక్ట్ చేసే హీరోయిజం మిస్ అవుతుంది. ఆ విషయం దర్శకుడు మర్చిపోయి.. పందెం కోడి సమయంలోనే ఉండిపోయారు.

అక్కడే ఉన్నామా

అలాగే.. ఈ సినిమా చూస్తూంటే..  ఇంకా బొబ్బిలి బ్రహ్మన్న..పెద రాయుడు  రోజుల్లో  ఉన్నామా అనే సందేహం వస్తుంది. ఇంకా అలాంటి పాత్రలు వర్కవుట్ చేయాలి అనే ఆలోచన ... చెప్పుకోదగినదే. ఏడు ఊళ్ల వాళ్లు ఓ పెద్దాయన అంటూ ఒకరిని దేవుడిగా కొలవటం.. అయ్యగారు,మా దేవుడు అంటూ చిత్రమైన ప్రపంచంలో ఉండంటం ఆశ్చర్యం అనిపిస్తుంది. 

హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే..

తొలి సినిమాకు ప్లస్.. మీరా జాస్మిన్. ఆమె అభినయం.. చిలిపితనం సినిమాకు బాగా కలిసొచ్చింది. అయితే ఇక్కడ కీర్తి సురేష్ ని ఆమెలాగే  చేయించే ప్రయత్నం చేశారు కానీ ...ఆ స్దాయిలో సీన్స్ పండలేదు.

జాతరే..

సినిమా మొత్తాన్ని జాతర నేపథ్యంలో నడపటంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే కంటిన్యూగా జాతర సీన్సే రిపీట్ అవటం... కథ అంతా అక్కడే తిరగటం... అదీ తమిళ వాసనతో కూడినవి కావటం చూడ్డానికి కొద్దిగా ఇబ్బందే.

                             

టెక్నికల్ గా ...

నటుడుగా విశాల్ ... ఇందులో పెద్దగా చేసిందేమీ లేదు. ఆయన చాలా సినిమాల్లో చేసిందే. కీర్తి సురేష్ జస్ట్ ఓకే.  క్లైమాక్స్‌లో.. రాజారెడ్డి పాత్ర‌లో రాజ్‌కిర‌ణ్ బాగా చేశారు.  గంజా క‌రుప్పు, రాందాస్ వంటి తమిళనటులు తమ పాత్ర మేరకు చేసుకుంటూ పోయారు. లింగుస్వామి టేకింగ్‌ బాగుంది.  పాటలు బాగోలేవు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎట్మాస్ఫియర్ ని ఎస్టాబ్లిష్ చేసింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. సెకండాఫ్ లో కొంత ఎడిట్ చేస్తే బాగుండేది అనిపించింది.


ఫైనల్ ధాట్

ట్రైలర్ కట్ చేయటం మీద పెట్టిన శ్రద్దలో నూరోవంతు కూడా సినిమామీద పెట్టలేదనేది నిజం.

ఒవరాల్ రేటింగ్ : 2/5


ఎవరెవరు

స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
బ్యాన‌ర్స్‌: లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌
న‌టీనటులు విశాల్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాజ్‌కిర‌ణ్, హ‌రీష్ పేర‌డే, గంజా క‌రుప్పు త‌దిత‌రులు
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌
కెమెరా: కె.ఎ.శ‌క్తివేల్‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా
దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి

click me!