పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. సోషల్ మీడియాలో ఈ చిత్ర హంగామా ఒక రేంజ్ లో ఉంది. చిత్ర యూనిట్ వరుసగా సర్ ప్రైజ్ లు ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. సోషల్ మీడియాలో ఈ చిత్ర హంగామా ఒక రేంజ్ లో ఉంది. చిత్ర యూనిట్ వరుసగా సర్ ప్రైజ్ లు ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నేడు విడుదల చేసిన 'లాలా భీమ్లా' సాంగ్ కూడా అభిమానులని ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో నిత్యామీనన్ తొలిసారి Pawan Kalyan కి జోడిగా నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో Nithya Menen మాట్లాడుతూ Bheemla Nayak, పవన్ కళ్యాణ్ గురించి స్పందించింది. నాకు ఆల్రెడీ త్రివిక్రమ్ గారితో పనిచేసిన అనుభవం ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి సరసన నటించడం ప్లెసెంట్ ఫీలింగ్.
undefined
Also Read: 'చిలసౌ' బ్యూటీ మైండ్ బ్లోయింగ్ బెల్లీ షో.. కామెంట్లు మోతెక్కుతున్నాయి
అయ్యప్పన్ కోషియం మూవీ చాలా మంది చూసి ఉంటారు. ఆ చిత్రంలో కంటే ఈ మూవీలో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నాను. ఇంకా వర్కింగ్ షెడ్యూల్స్ ముందున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి. ఆయనతో కలసి నటించడం చాలా ఈజీ అని నిత్యా చెప్పుకొచ్చింది.
Also Read: Bheemla Nayak: 'లాలా భీమ్లా' సాంగ్.. పూనకాలు తెప్పించే బీట్, ఇదిగో లిరికల్ వీడియో
అలాగే నిత్యా మీనన్ మరో మూవీలో కూడా నటిస్తోంది.సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ 'స్కై ల్యాబ్' లో నిత్యా మీనన్ నటిస్తోంది. ఇక భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు.
కళ్ళతోనే హావభావాలు పలికించే అతికొద్ది మంది నటీమణుల్లో ఒకరిగా నిత్యామీనన్ గుర్తింపు సొంతం చేసుకుంది. నిత్యా మీనన్ తెలుగులో 'అలా మొదలయింది' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. గుండె జారీ గల్లంతయ్యిందే, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ లాంటి హిట్ చిత్రాలలో నిత్యా మీనన్ నటించింది.
Also Read: బాలయ్యతో చిరు, రాంచరణ్, ఎన్టీఆర్.. 'ఆహా'కు కాసుల పంట, ఆ లీకులు నిజమైతే..