క్రేజీ బజ్... మెగా 154లో పవన్ కళ్యాణ్ కూడా?

Published : Nov 07, 2021, 03:44 PM IST
క్రేజీ బజ్... మెగా 154లో పవన్ కళ్యాణ్ కూడా?

సారాంశం

 వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవి (Chirajeevi) పల్లెకారుడిగా కనిపిస్తారని టాక్. అలాగే ఈ సినిమాకు వాల్తేరు శ్రీను (Valter srinu) అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. 

దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో మెగా స్టార్ చిరంజీవి 154వ చిత్రం చేస్తుండగా, నిన్న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్స్ కె రాఘవేంద్రరావు, పూరి జగన్నాధ్, కొరటాల శివ, వివి వినాయక్, హరీష్ శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కేక పుట్టించాయి. చిరంజీవి ఊరమాస్ గెటప్స్ మూవీపై అంచనాలు, ఆకాశానికి చేర్చాయి. 


ఇక వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ మాస్ ఎంటర్టైనర్ లో చిరంజీవి (Chirajeevi) పల్లెకారుడిగా కనిపిస్తారని టాక్. అలాగే ఈ సినిమాకు వాల్తేరు శ్రీను (Valter srinu) అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. వీటన్నింటికి మించిన ఓ క్రేజీ న్యూస్ ఈ మూవీపై చక్కర్లు కొడుతుంది. కథరీత్యా చిరంజీవి తమ్ముడు పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్రను చిరు రియల్ బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని, దర్శకుడు బాబీ భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ ని ఒప్పించే ప్రయత్నాలలో చిత్ర యూనిట్ ఉందని, ఆయన ఓకే చెబితే మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్ సెట్ కావడం ఖాయం అంటున్నారు. 


వెండితెరపై చిరంజీవి-పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కలిసి కనిపించింది చాలా అరుదు. శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో ఓ సాంగ్ లో పవన్ సైతం కనిపిస్తారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న ఈ మెగా బ్రదర్స్ కలిసి నటిస్తే చూడాలని, చాలా మంది కోరుకుంటున్నారు. చిరంజీవి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ, అందరి కల నెరవేరుస్తాడేమో చూడాలి. ఇక బాబీ గత చిత్రం వెంకీ మామ లో వెంకటేష్, నాగ చైతన్యలను ఆన్ స్క్రీన్ మామ అల్లుళ్లుగా చూపించి, ఫ్యాన్స్ ని అలరించాడు. అదే తరహాలో మెగా బ్రదర్స్ తో ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

Also read Bheemla Nayak: 'లాలా భీమ్లా' సాంగ్.. పూనకాలు తెప్పించే బీట్, ఇదిగో లిరికల్ వీడియో
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో చిరు 154 (Mega 154) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ తో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రాలు చేస్తున్నారు చిరంజీవి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 

Also read Mega 154 Update: బిగ్ బాస్ ఊర మాస్ అవతార్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం