
పూరీ జగన్నాథ్ తనయుడిగా ఆకాశ్ పూరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే . ఆకాష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.
కాకపోతే ప్రమోషన్స్ బాగుండటంతో మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ముఖ్యంగా యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఈ సినిమా డ్రాప్ అవటం మొదలెట్టింది. దీపావళి వీకెండ్‌లో కొత్త సినిమాల విడుదల వలన రొమాంటిక్ కు థియేటర్స్ కూడా తగ్గిపోయాయి.
తొమ్మి రోజుల కలెక్షన్స్ ఓ సారి చూస్తే...
నైజాం: 1.34కోట్లు
సీడెడ్: 75లక్షలు
ఉత్తరాంధ్ర: 50లక్షలు
ఈస్ట్ గోదావరి: 29లక్షలు
వెస్ట్ గోదావరి: 21లక్షలు
గుంటూరు: 30లక్షలు
కృష్ణా: 29లక్షలు
నెల్లూరు: 18లక్షలు
ఆంద్రా-తెలంగాణా మొత్తం:- 3.86 కోట్లు(6.21 కోట్లు గ్రాస్)
కర్ణాటక+భారత్ లో మిగిలిన ప్రాంతాలు: 10లక్షలు
ఓవర్ సీస్ – 8లక్షలు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: 4.04కోట్లు(6.45కోట్లు గ్రాస్)
ఇక రొమాంటిక్ సినిమాను మొత్తంగా 4.6 కోట్ల రేటుకి అమ్మారు.. ఈ సినిమా 5 కోట్ల రేంజ్‌లో బ్రేక్ ఈవెన్ ఫిక్సైంది. ఈ సినిమా ఎనిమిది రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 0.96 కోట్ల కోట్ల షేర్‌ను అందుకోవాల్సి ఉంది.
ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.