'మాచర్ల నియోజకవర్గం'లో రాజమౌళి హీరో.. నితిన్ మాస్ యాటిట్యూడ్ అదుర్స్, సాలిడ్ ట్రైలర్ ఇదిగో

By team teluguFirst Published Jul 30, 2022, 9:23 PM IST
Highlights

ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు.

నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ కి యూట్యూబ్ లో అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ వచ్చేసింది. 

ట్రైలర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. దర్శకుడు శేఖర్ కి ఇది డెబ్యూ చిత్రమే అయినప్పటికీ అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టినట్లు అర్థం అవుతోంది. ఫ్యామిలీ, గర్ల్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే సిద్ధార్థ్(నితిన్) కలెక్టర్ గా విధులు నిర్వహించేందుకు మాచర్లకు వెళతాడు. 

అక్కడ ఆ నియోజకవర్గానికి చెందిన పొలిటీషియన్ రాజప్ప(సముద్రఖని)తో నితిన్ కి రగడ మొదలవుతుంది. ఎలాగైనా ఆ నియోజకవర్గంలో ఎన్నిక జరిపించాలని నితిన్ పట్టుబడతాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వివాదం ఎంత దూరం వెళ్ళింది అనేది ఈ చిత్ర కథగా ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. 

'ఈ జిల్లా కలెక్టర్ గా నా బాధ్యత.. ఈ సారి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరిపించడమే' అంటూ నితిన్ లౌడ్ వాయిస్ తో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా పంచ్ లు.. వీళ్ళేమో బోయపాటి శ్రీను లాగా యాక్షన్.. ఇప్పుడు నేనేం చేయాలి.. రాజమౌళి హీరోలాగా ఎలివేషన్ ఇవ్వాలా' అంటూ నితిన్ చెప్పే డైలాగ్ అతడి మాస్ యాటిట్యూడ్ ని ప్రతిబింబిస్తోంది. 

ఓవరాల్ గా ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రయిలర్ తో మరింతగా పెరుగుతాయి. కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సముద్ర ఖని మరోసారి పవర్ ఫుల్ గా కనిపించారు. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

 

click me!