హరికృష్ణ గురించి ఎవరికీ తెలియని విషయాలు!

By Udayavani DhuliFirst Published Aug 30, 2018, 2:27 PM IST
Highlights

సినీనటుడు హరికృష్ణ నిన్న జరిగిన కారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో నందమూరి కుటుంబం, అభిమానులు విషాదంలో మునిగిపోయారు

సినీనటుడు హరికృష్ణ నిన్న జరిగిన కారు యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో నందమూరి కుటుంబం, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం నందమూరి కుటుంబం ఆయనకు అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతుంది. సినీనటుడిగా, టీడీపీ పార్టీ లీడర్ గా ఆయన జీవితం తెరిచిన పుస్తకమే..కానీ ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు బయటకి వచ్చాయి. 

-హరికృష్ణ రోజు తెల్లవారుజామున మూడు గంటలకే లేచేవారట. అప్పటినుండి క్రమపద్ధతిలో ఆయన దినచర్య మొదలయ్యేదని చెబుతున్నారు. 

-రోజు రాత్రి నాటికి వెళ్లేముందు అరలీటరు జెర్సీ పాలు తాగడం ఆయనకు అలవాటు. ఒకవేళ ఒత్తిగా అనిపిస్తే.. అబిడ్స్ లోని కెఎఫ్ సి నుండి చికెన్ లాలీపాప్ లు, పాపాజీ డాబా నుండి తండూరి చికెన్ తెప్పించుకునేవారు. 

-హరికృష్ణకు 17 ఏళ్లుగా రమణయ్య అనే వ్యక్తి సేవలు అందిస్తున్నారు. హరికృష్ణకి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన తినడం దగ్గర నుండి పడుకునేవారు ఏం తినాలి..? మందులు ఏ ఏ టైమ్ లో వేసుకోవాలి..? ఇలా ప్రతిదీ ఆయన చూసుకునేవారట. రమణయ్యతో చాలా ఆప్యాయంగా మాట్లాడేవారట హరికృష్ణ.  

-హరికృష్ణకు అబిడ్స్ లో ఆహ్వానం అనే హోటల్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆ హోటల్ లోని 1001 నెంబర్ గల రూమ్ ని ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఆ రూమ్ ఆయనకు చాలా ప్రత్యేకం. కీలక నిర్ణయాలు అందులోనే తీసుకునేవారు.  

-సీతయ్య సినిమాలో హరికృష్ణ వాడిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడుడప్పుడు ఆ బైక్ మీదే అబిడ్స్ లో చక్కర్లు కొట్టేవారట. పాన్ షాప్ కి వెళ్లి పాన్, మిగిలిన వస్తువులను స్వయంగా కొనేవారని చెబుతున్నారు.  

-ఆవుకు పూజలు చేయడం, సమయం ఉంటే వనస్థలిపురంలో ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు పూజలు చేసేవారు. తన కొడుకు జానకిరామ్ చనిపోయిన తరువాత ఆవేదనతో మూడు నెలలు హోటల్ కు వెళ్లలేదు. ఆ సమయంలో మూగజీవాల ఆలనాపాలన చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఆవును గోశాలకు, మిగిలిన పక్షులను జూపార్క్ కి పంపించేశారు.

-హరికృష్ణకి చెందిన రామకృష్ణ థియేటర్ లోనే ఎక్కువగా సినిమాలు చూసేవారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినిమాలను ఆ థియేటర్ లోనే చూసేవారు. తన తండ్రి నటించిన సినిమాలను కూడా అక్కడే చూసేవారట. 

ఇవి కూడా చదవండి.. 

'ఏమోయ్ పోసాని.. నాకు డబ్బులివ్వవేంటి' అని హరికృష్ణ అడిగారు!

హరికృష్ణ నా సోదర సమానులు.. ఎమోషనల్ అయిన చిరంజీవి!

కౌగిలించుకుని జూ. ఎన్టీఆర్ ను ఓదార్చిన కేసిఆర్ (ఫొటోలు)

కారు నడుపుతూ చనిపోయారా..? నమ్మలేకపోతున్నా: దర్శకేంద్రుడు!

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

click me!