నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు: మేఘన రాజ్‌

Published : Jun 19, 2020, 09:33 AM IST
నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు: మేఘన రాజ్‌

సారాంశం

చిరంజీవి, మేఘనలు సుధీర్ఘ కాలం ప్రేమించుకున్న తరువాత 2018లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మేఘప గర్భవతి. `చిరు.. నేను నీకు చెప్పాలనుకుంటున్న విషయాలకు అక్షర రూపం ఇచ్చేందుకు చాలా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. ప్రపంచంలోని అన్ని పదాలు కూడా నీవ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పేందుకు సరిపోవు తన ఆవేదనను పంచుకుంది.

ఇటీవల వరుస మరణాలు సినీ రంగాన్ని కలవరపెడుతున్నాయి. బాలీవుడ్‌తో పాటు సౌత్‌ ఇండస్ట్రీలోనూ సినీ ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవల మరణించిన సాండల్‌ వుడ్‌ స్టార్ హీరో చిరంజీవి సర్జ కుటుంబం ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న చిరంజీవి జూన్‌ 7న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చిరంజీవి భార్య మేఘన రాజ్‌కు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పుడిప్పుడే చిరంజీవి మరణించిన నిజాన్ని జీర్ణించుకుంటున్న మేఘనా తాజాగా సోషల్ మీడియా వేదిక చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

చిరంజీవి, మేఘనలు సుధీర్ఘ కాలం ప్రేమించుకున్న తరువాత 2018లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మేఘప గర్భవతి. `చిరు.. నేను నీకు చెప్పాలనుకుంటున్న విషయాలకు అక్షర రూపం ఇచ్చేందుకు చాలా చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. ప్రపంచంలోని అన్ని పదాలు కూడా నీవ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పేందుకు సరిపోవు. నా స్నేహితుడివి, నా ప్రేమికుడివి, నా భాగస్వామివి, నా బిడ్డవి, నా ధైర్యానివి, నా భర్తవి ఇంకా చాలా. నువ్వు నాలొ భాగం చిరు. మన బిడ్డ రూపంలో నువ్వు తిరిగి నా దగ్గరకి రానున్నావు. నీన్ను ఎత్తుకునేందుకు నేను ఎదురు చూస్తున్నాను` అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది మేఘన.

సాండల్ స్టార్‌ హీరో యాక్షన్ కింగ్ అర్జున్‌ వారసుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు చిరంజీవి సర్జ. వాయుపుత్ర సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, 12 సినిమాల్లో నటించాడు. ఎక్కవుగా రీమేక్ సినిమాలతో సూపర్‌ హిట్లు సాధించాడు. తనతో హీరోయిన్‌గా నటించిన మేఘన రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జూన్‌ 6న శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురుకావటంతో ఆయన్ను బెంగళూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించటంతో ఆయన మరణించాడు.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్