దిలీప్ అరెస్ట్.. కావ్య మాధవన్ ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్

First Published Jul 12, 2017, 3:55 PM IST
Highlights
  • మళయాల నటి భావన కిడ్నాప్, సెక్సువల్ హరాస్ మెంట్ కేసులో దిలీప్ అరెస్ట్
  • దిలీప్ ను రెండో వివాహం చేసుకున్న నటి కావ్య మాధవన్
  • విమర్శలు వెల్లువెత్తడంతో ఫేస్ బుక్ అకౌంట్ రద్దు చేసుకున్న కావ్య మాధవన్

మళయాల నటి భావన కిడ్నాప్ కేసులో సూపర్ స్టార్ దిలీప్ కుమార్ అరెస్ట్ కావడంతో ఆయన సతీమణి కావ్య మాధవన్ తన ఫేస్ బుక్ అకౌంటు రద్దు చేసుకుంది. దిలీప్ అరెస్టయిన తర్వాత ఫేస్ బుక్ లో సోషల్ మీడియా జనం నుంచి వస్తున్న విమర్శలకు సమాధానమివ్వలేక కావ్య మాధవన్ ఈ పని చేసింది.

 

భావనపై సెక్సువల్ హరాస్ మెంట్ కేసుకు మూల కారకుడిగా అనుమానిస్తూ పోలీసులు సోమవారం దిలీప్ ను అరెస్ట్ చేశారు. ప్రస్థుతంం 14 రోజుల రిమాండ్ కొనసాగుతోంది. దిలీప్ అరెస్ట్ తర్వాత జనం కావ్య ఫేస్ బుక్ పేజీలో నెగెటివ్ కమెంట్స్ పెడుతూ తీవ్రంగా విమర్శిస్తుండటంతో... కావ్య తన ఫేస్ బుక్ ఖాతాను బ్లాక్ చేసింది.

 

మరోవైపు అమ్మ( అసోసియేషన్ ఆఫ్ మళయాలం మూవీస్ ఆర్టిస్ట్) కూడా దిలీప్ సభ్యత్యం తొలగించింది. పోలీసులకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికినందునే దిలీప్ ను అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారని సమాచారం.

click me!