మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా పక్కా.. ఇదే రుజువు!

Published : Oct 07, 2020, 10:44 AM IST
మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా పక్కా.. ఇదే రుజువు!

సారాంశం

మహేష్‌- త్రవిక్రమ్‌ కాంబినేషన్‌లో త్వరలో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. అందుకు మహేష్‌ చేసిన ట్వీటే నిదర్శనంగా నిలిచింది.

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేష్‌.. టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబో అనే చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన `అతడు` బ్లాక్‌ బస్టర్‌. ఇది థియేటర్‌లో కంటే టీవీలో బాగా ఆడింది. అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా, అలాగే అత్యధిక టీఆర్పీ పొందిన చిత్రంగానూ నిలిచింది. 

ఆ తర్వాత ఐదేళ్ళకి `ఖలేజా` వచ్చింది. ఈ సినిమా అటు మహేష్‌కి, ఇటు త్రివిక్రమ్‌లో ఓ భిన్నమైన ప్రయత్నం. కానీ వర్కౌట్‌ కాలేదు. సినిమాపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఆ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇదిలా ఉంటే `ఖాలేజా` విడుదలై నేటి(బుధవారం)తో పదేళ్ళు పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా మహేష్‌ ట్వీట్‌ చేశారు. నటుడిగా తనని రీ ఎన్వెంట్‌ చేసిన చిత్రమిదన్నారు. ఎప్పటికీ తనకు ఇదొక స్పెషల్‌ చిత్రమని, ఈ సందర్భంగా తన మంచి స్నేహితుడు, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు త్వరలో వీరి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతుందనే హింట్‌ కూడా ఇచ్చాడు. `మా నెక్ట్స్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. అది త్వరలోనే ఉంటుంది` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. ఈ సందర్భంగా `ఖలేజా` చిత్రానికి చెందిన ఓ వీడియోని పంచుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌.. పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ అన్నీ కుదిరితే రాజమౌళి డైరెక్షన్‌లో ఉంటుంది. ఇక త్రివిక్రమ్‌ ఈ ఏడాది `అలా వైకుంఠపురములో`తో భారీ హిట్‌ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత ఎవరితో అనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. చిరంజీవితో ఉంటుందన్నారు. కానీ అది మహేష్‌తోనే ఉండే అవకాశాలున్నట్టు మహేష్‌ ట్వీట్‌ చూస్తే అర్థమవుతుంది. ఇదే వర్కౌట్‌ అయితే దాదాపు 11ఏళ్ళ తర్వాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూడొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?