టాప్ లెస్ గా త్రిష..?

By Udaya DFirst Published Feb 25, 2019, 3:28 PM IST
Highlights

తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి త్రిషకి ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస ఆఫర్లు రావడంతో బిజీ హీరోయిన్ గా మారింది. 

తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన నటి త్రిషకి ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ వరుస ఆఫర్లు రావడంతో బిజీ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలతో జత కడుతూ సక్సెస్ లు అందుకుంటోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో ఒకటైన 'పరంపదం విలయట్టూ' అనే సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో త్రిష అర్ధనగ్నంగా కనిపించబోతుందట.

కథలో భాగంగా సినిమాలో త్రిష దెయ్యం పాత్రలో నటిస్తోంది. ఆ పాత్రలో త్రిష అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. అందులో భాగంగానే టాప్లెస్ గా ఆమె  నటించిందని సినిమా వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే మరికొందరు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని, అదంతా మేకప్ లో భాగంగానే చేశారని, స్కిన్ కలర్ మేకప్ వేశారని చెబుతున్నారు. అయితే దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది!
 

click me!