తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:47 PM (IST) Apr 19
రెట్రో సినిమా షూటింగ్‌లో సూర్య తలకి పెద్ద దెబ్బ తగిలిందని ఎవికైనా తెలుసా? ఇన్ని రోజులు ఎవరికీ తెలియని ఈ రహస్యాన్ని సీనియర్ నటుడు వెల్లడించారు. ఇంతకీ సూర్యకు ఏమయ్యింది?
పూర్తి కథనం చదవండి09:07 PM (IST) Apr 19
సౌత్ స్టార్ యాక్టర్ బాబీ సింహం కారుకు ప్రమాదం జరిగింది. వరుసగా 7 వాహనాలను డీ కొడుతూ దూసుకుపోయింది బాబీ కారు. ఈ సంఘటనతో అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
పూర్తి కథనం చదవండి08:40 PM (IST) Apr 19
ఆకాలంలో కాని.. ఈ కాలంలో కాని నటీనటులు నటనమీద మాత్రమే ఆధారపడలేదు. నిర్మాతలుగా, దర్శకులుగా ప్రతిభ చూపించిన వారు చాలా మంది ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. అలాంటి ఓ స్టార్ కమెడియన్ పెద్దాయన ఎన్టీఆర్ తో సినిమా చేసి నిర్మాతగా అడుగు పెట్టాడు. డబ్బులు లేకపోయినా.. తన ఇంటిని 40 వేలకు తాకట్టు పెట్టి మరీ సినిమా చేసిన ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా? మరి ఆసినిమా హిట్ అయ్యిందా లేదా?
పూర్తి కథనం చదవండి06:42 PM (IST) Apr 19
రీసెంట్ గా నటి ఊర్వశి రౌటేలా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఓ ఆలయం ఉందని, సౌత్ లో కూడా తనకు టెంపుల్ కట్టాని ఆమె అన్నారు. అయితే ఆమె చెప్పిందంతా అబద్ధమని, అది పార్వతీ దేవి ఆలయమని తేలింది. ఈ విషయంలో పూజారులు కూడా ఊర్వశిపై మండిపడ్డారు.
05:52 PM (IST) Apr 19
Bad News for Bigg Boss Fans: బిగ్ బాస్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. ఈసారి బిగ్ బాస్ షో ఉంటుందో లేదో కాస్త డౌటే. ఈ సీజిన్ ముందుకు వెళ్లేలా కనిపించడంలేదు. చాలా ఏళ్ళుగా ఆడియన్స్ ను అలరిస్తున్న ఈ రియాల్టీషోకు బ్రేక్ లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ బిగ్ బాస్ ఎందుకు ఆగిపోబోతోంది. కారణం ఏంటి? అసలు బిగ్ బాస్ ఆగిపోతుందన్న వార్తల్లో నిజం ఎంత?
పూర్తి కథనం చదవండి05:15 PM (IST) Apr 19
ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ కొత్త కారు కొన్నారు. తన లగ్జరీ కారుకు సబంధించిన ఫోటోలతో పాటు వివరాలను ఆయన తన సోషల్ మీడియాలో శేర్ చేశారు. ఇంతకీ రెహమాన్ కొన్న కారు ఏంటి? దాని కాస్ట్ ఎంతో తెలుసా?
పూర్తి కథనం చదవండి05:05 PM (IST) Apr 19
విజయశాంతి సినిమాల్లో ఎంత పవర్‌ఫుల్లో తెలిసిందే. ఆమె పోలీస్ డ్రెస్ వేసి లాఠీ పడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` చిత్రంలోనూ అలాంటి పాత్రలోనే నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చింది. తన సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఫైర్ అయ్యింది. సినిమాని ఖూనీ చేస్తున్నారని, వాళ్లని క్షమించేది లేదని వెల్లడించింది.
04:20 PM (IST) Apr 19
ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు కామన్. స్టార్స్ మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని గొడవలు మర్చిపోయి కలిసిపోతుంటారు. మరికొన్ని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో కాంట్రవర్సీ స్టార్ అంటే మోహన్ బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. మోహన్ బాబు సరదాగా కొంత మందితో, సీరియస్ గా మిరికొంత మందితో గొడవలుపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో ఓ సారి చిన్న గొడవ జరిగి, స్టార్ హీరో మోహన్ బాబు కాలర్ పట్టుకుని గెట్ అవుట్ అన్నాడట ఇంతకీ ఎవరా స్టార్ హీరో, ఎందుకు గొడవ జరిగింది.?
పూర్తి కథనం చదవండి03:27 PM (IST) Apr 19
Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి మరోసారి ప్రమాదం తప్పింది. ఆయన తాజాగా మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరుగుతున్న కార్ రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు. యూరోపియన్ కార్ రేస్‌లో నేడు శనివారంలో పాల్గొనగా, ఆయన కారు ప్రమాదానికి గురయ్యింది. అదుపు తప్పి సైడ్ డివైడర్‌ని గుద్దేసింది.
పూర్తి కథనం చదవండి02:30 PM (IST) Apr 19
ఐశ్వర్యా రాజేష్ తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రారంభంలో ఆమె డిజప్పాయింట్ చేసింది. తను నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకి సరైన పాత్ర ఇచ్చాడు. అదరగొట్టాడు. ఆమె నటనతో అదరగొట్టేలా చేశాడు. ఐశ్వర్య రాజేష్ ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో జోడీ కట్టి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేసే పనిలో ఉంది.
01:06 PM (IST) Apr 19
Vijayashanti: లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఓ వైపు ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అయ్యింది. అలాగే సినిమాల్లోనూ మళ్లీ తానేంటో చూపిస్తుంది. తాజాగా `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా నటించి మెప్పించారు. వింటేజ్ విజయశాంతిని చూపించారు.
పూర్తి కథనం చదవండి11:38 AM (IST) Apr 19
సినిమా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇటీవల 'బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను' అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన షరతులతో కూడిన క్షమాపణ చెప్పారు.
పూర్తి కథనం చదవండి09:35 AM (IST) Apr 19
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన `జాట్` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. కలెక్షన్ల పరంగా ఇది పోరాడుతుంది. చాలా తక్కువ ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ మూవీ ప్రారంభంలో బాగా ఇబ్బంది పడింది. కానీ రెండో వారంలో మాత్రం అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. సడెన్‌గా జంప్ టీమ్‌ని ఆశ్చర్యపరుస్తుంది. మరి ‘జాట్’ 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది చూస్తే.
పూర్తి కథనం చదవండి09:11 AM (IST) Apr 19
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్‌లో డేరింగ్ పర్సనాలిటీకి కేరాఫ్. ఆయన ఎన్నో సాహసోపేతమైన చిత్రాలు చేసి మెప్పించారు. కమర్షియల్‌గా విజయాలు సాధించారు. అంతేకాదు సినిమాకి సంబంధించి టెక్నీకల్‌గా ఆయనే తెలుగు సినిమాకి పరిచయం చేశారు. సినిమా స్కోప్, 70ఎంఎం, కలర్ చిత్రాలను పరిచయం చేసింది ఆయనే కావడం విశేషం. నిర్మాతలు మెచ్చిన హీరో కూడా కృష్ణనే కావడం విశేషం.
పూర్తి కథనం చదవండి07:34 AM (IST) Apr 19
Actress Roja: నటి రోజా మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమె మంత్రిగానూ పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ టీవీ షోస్‌లో మెరిసింది. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అవుతుందట. ఈ నేపథ్యంలో ఆమెకి ఇక సినిమా ఛాన్సులు రావనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.