తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:53 PM (IST) Jul 13
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోపై క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సీజన్లుగా బిగ్ బాస్ షో ఒకే తరహాలో సాగింది.
08:35 PM (IST) Jul 13
ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించారు. కామెడీ రోల్స్ చేసినా, విలన్ గా నటించినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించేవారు.
07:44 PM (IST) Jul 13
బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీల గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
07:36 PM (IST) Jul 13
పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి పోటీగా ఓ డబ్బింగ్ సినిమాని దించుతున్నారు అల్లు అరవింద్.
05:33 PM (IST) Jul 13
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ రియాలిటీ షోకి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ వినిపిస్తుంది. కొందరు కంటెస్టెంట్లు ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వాళ్లెవరో చూద్దాం.
03:43 PM (IST) Jul 13
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే?
02:25 PM (IST) Jul 13
కోట శ్రీనివాసరావు మరణాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హాస్యనటుడు బ్రహ్మానందం, బాబూ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
01:34 PM (IST) Jul 13
కోటా శ్రీనివాసరావు అనగానే గుర్తుకువచ్చే మరో పేరు బాబుమోహన్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. దాదాపు 60 సినిమాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి స్నేహం, టాలీవుడ్ కే ప్రత్యేకం.
12:52 PM (IST) Jul 13
కోట శ్రీనివాసరావుతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమకి నటుడిగా పరిచయమైన ఒక హీరో ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌గా, సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన ఎవరు? ఆ కథేంటో చూద్దాం.
12:25 PM (IST) Jul 13
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఫిలిం నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. కోట శ్రీనివాసరావు తన విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చారు.
11:11 AM (IST) Jul 13
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణంపై టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్టార్ నటుడితో కలిసి పనిచేసిన క్షణాలను తలుచుకుంటూ సంతాపం ప్రకటిస్తున్నారు.
11:02 AM (IST) Jul 13
కోట శ్రీనివాసరావు నటుడుగా విశ్వరూపం చూపించిన టాప్ 10 సినిమాలు గురించి తెలుసుకుందాం. ఇందులో విలన్‌గా భయటపెట్టడమే కాదు, ఎమోషన్స్ తో ఏడిపించారు కూడా.
10:05 AM (IST) Jul 13
కోటా శ్రీనివాసరావు కెరీర్ లో అద్భుతమైన సినిమాలే కాదు ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఆయన పర్సనల్ లైఫ్ లో కోలుకోలేని విషాదం కూడా జరిగింది. ఆ విషాదమే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది.
08:29 AM (IST) Jul 13
తెలుగు తెర విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు పోషించారు. కానీ ఆయన కెరీర్‌ని మార్చేసిన మూవీ ఒకే ఒక్కటి. అదేంటో చూద్దాం.
08:05 AM (IST) Jul 13
కన్నప్ప సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించారు మంచు మోహన్ బాబు. ఇటువంటి విషయాల్లో ఘటుగా స్పందించే స్టార్ నటుడు. ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా కామెంట్స్ చేశారు. ఇంతకీ మోహన్ బాబు ఏమన్నారంటే?
07:14 AM (IST) Jul 13
సీనియర్ టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కోటా తన స్వగృహంలోనే మరణించారు.