బిగ్‌బాస్‌5లోని అబ్బాయిలపై లహరి శరి షాకింగ్‌ కామెంట్‌.. లవ్‌ చేసేందుకు ఒక్కడు కూడా లేదంటూ..

By Aithagoni RajuFirst Published Sep 6, 2021, 10:52 PM IST
Highlights

మరోవైపు హమీద తన లెన్స్ పోయాయని చెప్పడం దాన్ని శ్వేత వర్మ దొరికిందంటూ పరిగెత్తడం సందడిగా మారింది. అయితే కొందరు ఆమెని విమర్శించగా, మరికొందరు సెటైర్లు వేశారు. ఇందులో లహరి శరి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది.

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో సోమవారం మొదటి రోజు ప్రారంభమైంది. రాత్రి ఏం జరిగిందనేదాని నుంచి ఫస్ట్ డే ప్రారంభమైంది. ఇందులో లోబో గుర్రు కొట్టే సన్నివేశాలు, దాన్ని కవర్‌ చేసేందుకు ఇంటి సభ్యులు చేసే ఫన్నీ విషయాలు నవ్వులు పంచాయి. మరోవైపు హమీద తన లెన్స్ పోయాయని చెప్పడం దాన్ని శ్వేత వర్మ దొరికిందంటూ పరిగెత్తడం సందడిగా మారింది. అయితే కొందరు ఆమెని విమర్శించగా, మరికొందరు సెటైర్లు వేశారు. 

ఇందులో లహరి శరి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తనకు హౌజ్‌లో ఒకరితో లవ్‌ ట్రాక్ నడిపించాలని భావించిందట. కానీ పెళ్లైన వారే ఎక్కువగా ఉన్నారని, సన్నీ ముందు నుంచి తెలుసని, అతనిపై ఆ ఫీలింగ్‌ లేదని చెప్పింది. శ్రీరామ్‌ చంద్ర కనెక్ట్ కాలేదని, జెన్సీ తోనూ ఆ ర్యాపో కుదరడం లేదని వాపోయింది. బిగ్‌బాస్‌ ఇలా చేశాడేంటి అంటూ కాజల్‌తో ఆమె వాపోయింది. 

మరోవైపు ప్రియాంక మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది. తన జెండర్‌ ఛేంజ్‌ గురించి ఈ హౌజ్‌లోకి వచ్చే ముందు మాత్రమే చెప్పానని తెలిపింది. ధైర్యంగా చెప్పానని తనుచాలా ఎమోషనల్‌ అయ్యారని, కాజల్‌ ముందు ఎమోషనల్‌ అయ్యింది. ఆమెని కాజల్‌ ఓదార్చింది. 
 

click me!