అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్

First Published Apr 28, 2018, 5:25 PM IST
Highlights

అలాంటివి చూసైన సిగ్గుపడి మారాలి : కేటీఆర్

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావు సినిమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. రాజకీయ నేతగా.. మంత్రిగా ఫుల్ బిజీగా ఉండే కేటీఆర్.. కొన్నిసార్లు వీలు చూసుకుని సినిమాలకు వెళ్తుంటాడు. తాజాగా ఆయన ‘భరత్ అనే నేను’ సినిమా చూశాడు. అనంతరం మహేష్ బాబుతో కలిసి ఒక చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భరత్ అనే నేను లో ఆయనకి నచ్చిన సీన్ల గురించి ఇలా చెప్పుకొచ్చడు.

‘‘సినిమాలో మహేష్‌ సీఎం అవగానే ట్రాఫిక్‌ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా అలా చేస్తే ప్రజలు ఊరుకోరు. అది నాకు తెలుసు. అయితే, సినిమా చూసాకైనా కాస్త సిగ్గుపడి అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలు’’ అని అన్నారు.

ఇలాంటి సినిమాలు రావాలి: ‘‘మేము లేదా ప్రభుత్వ అధికారులు మంచి చెబితే ఎవరూ వినరు, అమలు చేయరు. కానీ, మీలాంటి స్టార్లు చెప్పే విషయాలు తప్పకుండా ప్రజలపై ప్రభావం చూపుతాయి. మంచి విషయాలు సినిమాల్లో చూపించడం ద్వారా మనం అలా ఉండాలనే భావం వారిలో కలిగే అవకాశం ఉంటుంది. అలాగని, సినిమా మొత్తం అలాగే ఉండాలని కోరడం లేదు. ‘భరత్ అనే నేను’ తరహాలోనే కమర్షియల్‌గా చూపింవచ్చు’’ అని కేటీఆర్ తెలిపారు.

click me!