సినిమాటోగ్రఫీ చట్టాన్ని వ్యతిరేకించేందుకు.. ఢిల్లీలో కమల్ హాసన్‌

By Aithagoni RajuFirst Published Jul 28, 2021, 6:08 PM IST
Highlights

సెన్సార్‌లో కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది కేంద్రం. అవి సినిమా మనుగడకి, భావప్రకటన స్వేచ్ఛకి విఘాతం కలిగేలా ఉన్నాయనే వాదనతో కమల్‌ ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

యూనివర్సల్‌ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952ని సవరించబోతుంది.  సవరణలతో కొత్తగా సినిమాటోగ్రఫీ యాక్ట్ 2021ని తీసుకురాబోతున్నారు. సినిమాలు, సెన్సార్‌లో కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది. అవి సినిమా మనుగడకి, భావప్రకటన స్వేచ్ఛకి విఘాతం కలిగేలా ఉన్నాయనే వాదనతో కమల్‌ ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

గతంలోనూ తన వ్యతిరేకత వెల్లడించారు. ఇప్పుడు డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి చెంది ఎంపీలతో కలిసి దీనిపై చర్చిస్తున్నారు. ముసాయిదా బిల్లు వ్యతిరేకంగా తన ప్రకటనని స్టాండింగ్‌ కమిటీ ముందు ఉంచనున్నారు కమల్‌. ఈ సవరణలు భావ వ్యక్తికరణ స్వేచ్ఛని హరింపచేయడమేని, కేంద్ర జోక్యం ఇందులో తగదని గతంలో కమల్‌ తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని అప్పట్లో సూర్య, ప్రణీత, అనురాగ్‌ కశ్యప్‌, ఫర్హాన్‌ అక్తర్, నందితాదాస్‌, షబానా అజ్మీ, నందితా దాస్‌, జోయా అక్తర్‌ వంటి వారు వ్యతిరేకిస్తున్నారు.

దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతని దెబ్బతీసేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇటీవల కాలంలో వస్తోన్న సినిమాలుంటున్నాయని ఫిర్యాదాలు అందుతున్న నేపథ్యంలో కేంద్రం సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేయబోతుంది. 

click me!