aaryan khan drugs case: దివ్య భారతితో కలిసి డ్రగ్స్ తీసుకున్నా అంటూ సీనియర్‌ నటి సంచలన పోస్ట్

By Aithagoni RajuFirst Published Oct 9, 2021, 10:15 AM IST
Highlights

ఆర్యన్‌ ఖాన్‌కి బాలీవుడ్‌ ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ వెంటనే రియాక్ట్ అయి షారూఖ్‌ ఇంటికి వెళ్లారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలనే దానిపై షారూఖ్‌తో ముచ్చటించారు. మరోవైపు హృతిక్‌ రోషన్‌, పూజా భట్ వంటి వారు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి సోమీ అలీ స్పందించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఓ షాకింగ్‌ పోస్ట్ ని పంచుకున్నారు. 
 

ముంబయి డ్రగ్స్ కేసు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. గతేడాది నుంచే ఇది బయటపడింది. ఆ సమయంలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్‌, సారా అలీ కాన్‌, రకుల్‌ సైతం విచారణ ఎదుర్కొన్నారు. ఇటీవల షారూఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ రేవ్‌ పార్టీలో దొరికిపోయాడు. ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే aaryan khanకి బాలీవుడ్‌ ప్రముఖులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ వెంటనే రియాక్ట్ అయి షారూఖ్‌ ఇంటికి వెళ్లారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలనే దానిపై షారూఖ్‌తో ముచ్చటించారు. మరోవైపు హృతిక్‌ రోషన్‌, పూజా భట్ వంటి వారు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి సోమీ అలీ స్పందించారు. సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఓ షాకింగ్‌ పోస్ట్ ని పంచుకున్నారు. 

పిల్లలు డ్రగ్స్ వాడటం సహజమే అని తెలిపింది. తనకిది విచిత్రంగా అనిపించడం లేదని, కానీ దీన్ని తప్పుగా చూడటం పెద్ద విచిత్రంగా అనిపిస్తుందని తెలిపింది somy ali. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేం. అందుకే వాటిని క్రిమినల్‌ జాబితాలో నుంచి తొలగించాలి. ఇక్కడ ఎవరు సాధువులు కాదు. నేను కూడా 15ఏళ్ల వయసులోనే డ్రగ్స్ తీసుకున్నా` అని షాకింగ్‌ విషయం వెల్లడించింది సోమి. 

also read:షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కి మరోసారి షాక్‌.. బెయిల్‌ తిరస్కరణ

అంతేకాదు అలనాటి నటి దివ్య భారతితో కలిసి డ్రగ్స్ తీసుకుందట. `ఆందోళన్‌` చిత్ర షూటింగ్‌ సమయంలో divya bharathiతో కలిసి డ్రగ్స్ ట్రై చేశానని తెలిపింది. ఈ విషయం చెప్పడానికి తనకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్‌ లేదని వెల్లడించింది సోమీ అలీ. ఆమె ఇంకా చెబుతూ, న్యాయ వ్యవస్థ ఒక విషయాన్ని నిరూపించేందుకు ఆర్యన్‌ని ఉపయోగించుకుంటోంది. మరి రేపిస్టులు, హంతకులను పట్టుకోవడంపై వారి దృష్టి ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది సోమీ. 1971 నుంచి అమెరికా డ్రగ్స్ పై యుద్దం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అది లభించడం మరింత సులభమైందని వెల్లడించింది. ఆర్యన్‌ ఖాన్‌ విషయంలో నా హృదయం షారూ్‌, గౌరీ ఖాన్‌ కలచివేస్తుంది. వారి కోసం నేను ప్రార్థిస్తున్నా, ఆర్యన్‌ నువ్వు ఏ తప్పు చేయలేదు. న్యాయం జరుగుతుందని తెలిపింది సోమీ అలీ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

drugs caseలో శుక్రవారం ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ని ముంబయి మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ని జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించింది. పాకిస్తాన్‌కి చెందిన సోమీ అలీ 1994లో `అంత్‌` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. సునీల్‌ శెట్టితో కలిసి నటించింది. ఆ తర్వాత `క్రిషన్‌ అవతార్‌`, `యార్‌ గద్దర్‌`, `తీస్రే కౌన్‌?`, `ఆవో ప్యార్‌ కరేనా`, `ఆందోళన్‌`, `మాఫియా`, `చుప్‌` వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. జస్ట్ ఐదేళ్లపాటే ఈ అమ్మడు సినిమాల్లో నటించి ఆ తర్వాత గుడ్‌బై చెప్పింది.

click me!