'అరవింద సమేత'లో హైలైట్ అదే..!

By Udayavani DhuliFirst Published Oct 6, 2018, 3:16 PM IST
Highlights

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ సినిమాకి రావల్సినంత పబ్లిసిటీ ఇప్పటికే వచ్చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ సినిమాకి రావల్సినంత పబ్లిసిటీ ఇప్పటికే వచ్చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమారిజల్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం సినిమా డిఐ వర్క్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ సమాచారాన్ని బట్టి సినిమాలో సెకండ్ హాఫ్ చాలా హెవీగా ఉండబోతుందట. ఎన్టీఆర్ ఉపన్యాసాలతో సెకండ్ హాఫ్ మొత్తం సాగుతుందని అంటున్నారు.

సినిమా ఫస్ట్ హాఫ్ లోనే భారీ ఫైట్లను పెట్టిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం సీమ ఫ్యాక్షనిస్ట్ లను తన మాటలతో ఎన్టీఆర్ మార్చే క్రమంలో పెద్ద పెద్ద డైలాగులు చెబుతాడట. ఈ డైలాగులన్నీ చాలా డెప్త్ గా ఉంటాయని తెలుస్తోంది.

తన వాయిస్ డిక్షన్ తో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక సినిమా మొత్తానికి ఎన్టీఆర్ చెప్పే డైలాగులు, ఇంటర్వెల్ బ్యాంగ్ సమయానికి వచ్చే యాక్షన్ సీన్ సినిమా స్థాయిని పెంచుతాయని చెన్నై వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

'అజ్ఞాతవాసి' డిజాస్టర్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అరవింద సమేత: ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రెస్ మీట్ (ఫోటోలు)

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

 

click me!