బిగ్ బాస్ జోలికి ఇక వెళ్లను.. నెక్స్ట్ అలాంటి షో చేస్తా: నాని

Published : Oct 06, 2018, 03:04 PM ISTUpdated : Oct 06, 2018, 03:25 PM IST
బిగ్ బాస్ జోలికి ఇక వెళ్లను.. నెక్స్ట్ అలాంటి షో చేస్తా: నాని

సారాంశం

మొత్తానికి బిగ్ బాస్ షో రెండవ సీజన్ ఇచ్చిన కిక్కుకి నానిలో ఊహించని మార్పు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని అందుకున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. పెద్దగా అంచనాలు లేకుండా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ను మొదటి ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. షో ముందుకు కొనసాగిన కొద్దీ ఎవరు ఊహించని పరిణామాలు ఆసక్తిని కలిగించాయి.   

మొత్తానికి బిగ్ బాస్ షో రెండవ సీజన్ ఇచ్చిన కిక్కుకి నానిలో ఊహించని మార్పు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని అందుకున్న విమర్శలు అన్ని ఇన్ని కావు. పెద్దగా అంచనాలు లేకుండా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ను మొదటి ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. షో ముందుకు కొనసాగిన కొద్దీ ఎవరూ ఊహించని పరిణామాలు ఆసక్తిని కలిగించాయి. 

ఆ సంగతి అటుంచితే.. హోస్ట్ గా పరవాలేదు అనిపించే విధంగా చేసిన నాని బిగ్ బాస్ జోలికి మళ్లీ వెళ్లనని ఇటీవల ఒక ఇంటార్వ్యులో వివరణ ఇచ్చారు. అయితే  మరో మంచి షోలకు హోస్ట్ గా చేయాల్సిన అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆమీర్ ఖాన్ కి మంచి గుర్తింపు తెచ్చిన సత్యమేవ జయతే లాంటి షోలు చేయాలని ఉన్నట్లు నానివరించారు. 

మరి నానికి అలాంటి అవకాశం ఎంతవరకు అందుతుందో చూడాలి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాని జెర్సీ అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో నాని.. అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా నాని నటించిన 'దేవదాసు' సినిమా మంచి విజయాన్ని అందుకుంది.                       

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?