'అజ్ఞాతవాసి' డిజాస్టర్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Oct 6, 2018, 2:34 PM IST
Highlights

త్రివిక్రమ్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సినిమా తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా చేశాడు. 

త్రివిక్రమ్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సినిమా తరువాత త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా చేశాడు.

'అజ్ఞాతవాసి' వంటి డిజాస్టర్ సినిమా తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో పని చేస్తుండడంతో అభిమానులు ఆందోళన పడ్డారు. 'అరవింద సమేత' పై 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ ప్రభావం ఉంటుందని అనుకున్నారు. ఇదే విషయంపై తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నేనెప్పుడూ అజ్ఞాతవాసి రిజల్ట్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందని అనుకోలేదు. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ జర్నీ. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు హిట్స్ వస్తాయి.. కొన్ని సార్లు ఫ్లాప్ లు వస్తాయి. నా కెరీర్ లో కూడా నేను కొన్ని ఫ్లాప్ సినిమాలలో నటించాను.

ఫ్లాప్ ప్రభావం తదుపరి సినిమాపై ఉంటుందని నేను నమ్మను. 'అరవింద సమేత వీర రాఘవ' అనేది కంప్లీట్ త్రివిక్రమ్ సినిమా. నేను ఆయన కలలో, ప్రయాణంలో ఒక భాగాన్ని మాత్రమే.. ఆయన రాసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి'' అని వెల్లడించాడు. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'లో హైలైట్ అదే..!

ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

 

click me!