స్విమ్మింగ్ పూల్ లో లవ్ బర్డ్స్...లవర్ ని పరిచయం చేసిన యంగ్ హీరో

By Satish ReddyFirst Published Sep 12, 2020, 4:25 PM IST
Highlights

మరో యంగ్ హీరో పెళ్ళికి సిద్ధం అవుతున్నాడనిపిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన లవర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేశాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర లవర్ నటాషా దలాల్  తో దిగిన ఓ రొమాంటిక్ ఫోటో పంచుకున్నారు. 
 

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన లవర్ ని పరిచయం చేశాడు. సోషల్ మీడియా ద్వారా తనతో కలిసి ఉన్న ఫోటో పంచుకున్నాడు. డిన్నర్ నైట్ లో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర నటాషా దలాల్ తో ఉన్న ఫోటో ఆయన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అలాగే 'నీవు పక్కనున్నంత వరకు నాకు భయం లేదని' ఓ కామెంట్ కూడా పోస్ట్ చేశారు. ఇక వరుణ్ ధావన్ పోస్ట్ కి బాలీవుడ్ సెలెబ్స్ స్పందించారు. మౌని రాయ్, సోఫీ చౌదరి, మనీషా మల్హోత్రా వంటివారు కామెంట్స్ రూపంలో యంగ్ కపుల్ కి బెస్ట్ విషెష్ చెప్పారు. 

వరుణ్ ధావన్ మరియు నటాషా దలాల్ మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తుంది. ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో కూడా వరుణ్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ కాదు బెస్ట్ కపుల్ అని కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా వరుణ్ ధావన్ తమ మధ్య రిలేషన్ ఉందని బయటపెట్టారు. తాజా పోస్టుతో వీరిద్దరి బంధంపై మరింత స్పష్టత ఇచ్చారు. త్వరలో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు గా ప్రచారం జరుగుతుంది. 

ఇక నటాషా దలాల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. కొంత కాలంగా ఈ జంట ముంబైలో షికార్లు చేస్తూ మీడియా కంట పడుతున్నారు. ప్రముఖ వేడుకలకు వీరిద్దరూ కలిసే హాజరవుతారు. ఏది ఏమైనా మరికొన్ని రోజులలో బాలీవుడ్ నుండి ఓ యంగ్ హీరో సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నాడని అర్థం అవుతుంది. ఈ ఏడాది స్ట్రీట్ డాన్సర్ 3డి మూవీతో అలరించిన వరుణ్ ప్రస్తుతం కూలి నంబర్ వన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

No I won’t be afraid just as long as you Stand by me 🧡🤍

A post shared by Varun Dhawan (@varundvn) on Sep 11, 2020 at 11:15pm PDT

click me!